Ponnam Prabhakar: తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేశారు.
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం అవుతుంది.
Tirumala Rush: వేసవి సెలవులతో పాటు వివిధ పరీక్షల ఫలితాల వెల్లడి కావడం, పైగా వీకెండ్ రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, వీరికి శ్రీవారి దర్శనం చేసుకోవడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది.
AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఈ రోజు (ఏప్రిల్ 20) విడుదల చేయనుంది. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
Minister Seethakka: ఆదిలాబాద్ జిల్లాలో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధరణితో దందాలు చేశారు.. అలాంటి వాటికి ఇప్పుడు భూభారతిలో చోటు లేదన్నారు.
గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరించినట్లు తెలిపింది.
Inter Exam Results: తెలంగాణలో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ రెడీ అయింది. ఈ నెల 22వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
ఓ చిన్నారి మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోయిన తల్లి చదివిస్తుందని కంటతడి పెట్టుకుంది. ఇక, ఆ చిన్నారి మాటలకి తల్లడిల్లిన ఆయన ఆ పాపను దగ్గరికి పిలిచి ఓదార్చాడు. సదరు చిన్నారితో పాటు హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దు అన్నారు. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దు.. ఎవరూ ఓటుకు వెళ్లకుండా విప్ కూడా ఇస్తామన్నారు.