కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. భారతదేశం ఈ ప్రతీకార చర్యల్లో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది అన్నారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్‌లోని ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదు అన్నారు.
సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంట పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో.. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు మృతి చెందారు.
ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రియాక్ట్ అయ్యారు. తమ దేశంలోని 5 ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలకు పాకిస్థాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని వెల్లడించారు.
India PakistanTensions: భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది.
Kishan Reddy: భారత్-బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి చారిత్రాత్మక ఒప్పందంగా నిలిచిపోతుంది అన్నారు.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తుంది. విజయవాడ సహా పలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షం పడుతుంది. గన్నవరం, నందిగామ, తిరువూరు, చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామంలో వినాయకుని దేవాలయంలో ఈదురు గాలులకు ధ్వజస్తంభం నేలకొరిగింది.
గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి 2009 ఎన్నికల్లో టిడిపి తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాతి కాలంలో వైసిపిలో చేరి కొవ్వూరుకు షిఫ్టయ్యారు. 2019ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో గెలిచి కీలకమైన రాష్ట్ర హోం మంత్రి అయ్యారామె. పదవిలో ఉన్నంత కాలం పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వనిత.... నియోజకవర్గ గ్రూపు తగాదాల్లో మాత్రం కీరోల్ ప్లే చేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.
అట్టహాసంగా జరిగిన అమరావతి రీ లాంఛ్ ప్రోగ్రామ్‌కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే... ఇప్పటివరకు ఇచ్చిన, ఇస్తున్న నిధులు కాకుండా ప్రధాని నోటి నుంచి ప్రత్యేక నిధుల ప్రస్తావన వస్తుందని రాష్ట్రం వైపు నుంచి ఆశించినా... అ మాట మాత్రం చెప్పలేదాయన.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ... ఆ దిశగా పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు టీడీపీ నాయకులు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అక్రమ మైనింగ్‌కు సంబంధించి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే కేసు బుక్ అయింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో కల్లోలం కొనసాగుతూనే ఉంది. నిరుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మార్పుతో మొదలైన వివాదం తీవ్ర తుఫాన్‌గా మారుతోందేతప్ప తీరం దాటడం లేదు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత రాజకీయ వైరం ఉంది.