Indian Govt: పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖలు రాసింది కేంద్ర హోంశాఖ. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11 వినియోగించుకోవాలని ఆ లేఖలో తెలిపింది. అయితే, రూల్ 11 ప్రకారం సైరన్ వంటి అత్యవసర పరికరాలు కొనేందుకు పూర్తి అధికారం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక, అవసరమైతే అత్యవసర అధికారాలు ఉపయోగించుకోవాలని వెల్లడించింది కేంద్ర హోంశాఖ.
Read Also: S-400 sudarshan chakra: మనోహర్ పారికర్ సార్, మీరు లేకున్నా.. మీ నిర్ణయం భారత్‌ని రక్షించింది.
అయితే, భారత్ లోని సరిహద్దు నగరాల్లో పాకిస్తాన్ దాడి చేస్తుందనే ముందస్తు సమాచారంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో భద్రతాను పటిష్టం చేశారు. ఇక, ప్రజలను అలర్ట్ చేయడానికి సైరన్ లను ఉపయోగిస్తుంది భద్రతా దళాలు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ గా ఉండి పౌరుల భద్రతకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండాలని సూచనలు చేసింది.