Palnadu: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ లో దుండగులు చోరీకి యత్నించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. ఒక్కసారిగా భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
CM Chandrababu: ఈరోజు ఉదయం 11గంటలకి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరుకానున్నారు.
Amit Shah: రేపు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. రేపు ఉదయం 11.25 గంటలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానశ్రయానికి చేరుకోనున్నారు.
Swetcha’s father: ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ఇలా చేసుకోవడానికి పూర్ణ చందర్ అనే వ్యక్తి కారణమని ఆరోపించారు. గత 3 సంవత్సరాల నుంచి నా కూతురు వెంట పూర్ణచంద్రరావు పడ్డాడు.. పూర్ణచందర్ వేధింపుల వల్లనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది.
మా హయాంలో లక్ష ఆరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చాము.. కానీ, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు అని పేర్కొన్నారు. దానిపై పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగితే అసెంబ్లీని వాయిదా వేసుకొని వెళ్లారు.. మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇరవై నెలల్లో 12 వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు అని హరీష్ రావు వెల్లడించారు.
Warangal Congress Clash: హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి అనుచరులతో వచ్చిన కొండా మురళి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీకి ఆరు పేజీలతో కూడిన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను కమిటి ముందుకు రండి అని ఎవరు పిలవలేదు.. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చాను అన్నారు.
DRDO- Telangana Govt Mou: రక్షణ శాఖతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట్, ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ సిద్ధమైంది.
Fake Caste Certificate Scam: సంగారెడ్డి జిల్లాలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులే లక్ష్యంగా ఈ దాందా కొనసాగుతుంది. ఒక్కో సర్టిఫికేట్ ని 10 వేల నుంచి 20 వేల రూపాయలకు అమ్ముకుంటున్నట్టు సమాచారం.
Hyderabad: బుద్ధిగా చదువుకోమని చెప్పడమే తల్లి అంజలి చేసిన నేరమైంది..!! కూతురు తేజశ్రీకి మాత్రం తల్లి చేష్టలు మరోలా అర్థమయ్యాయి !! మొదటి భర్తకు పుట్టిన కూతురును కాబట్టే నన్ను పట్టించుకోవడం లేదని, రెండో భర్త కూతురైన తన చల్లిపైనే ప్రేమ చూపిస్తోందని అనుకుంది తేజశ్రీ.