Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఎమ్యెల్యేల కొనుగోలు కేసుపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ ఆడియోలు రిలీజ్ చేశారు.
Warangal Horror: వరంగల్ జిల్లాలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక వివాహితపై అత్యంత క్రూరంగా దాడి చేసిన ఘటన స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో, ఆమెను బంధించి, వివస్త్రను చేసి దారుణంగా హింసించారు.
PJR Flyover: హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ నేటి (జూన్ 28) నుంచి అందుబాటులోకి రానుంది. పీజేఆర్ ఫ్లైఓవర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు.
Hyderabad: నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయం దగ్గర ధర్నా చేయనున్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పిలుపునిచ్చారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయనున్నారు.
ఈరోజు ( జూన్ 28న ) జూరాల ప్రాజెక్టును రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని తెగిపోయిన నాలుగు గేట్ల రోప్‌లను పరిశీలించనున్నారు.
Elon Musk: అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా ఖండించారు. ధనిక దేశాలైన అమెరికా, జపాన్, ఇటలీలో జననాల సంఖ్య తగ్గుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
హోసబాలే వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని "ఎప్పుడూ" అంగీకరించలేదని ఆరోపించారు. అలాగే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూతో సహా దాని వ్యవస్థాపక పితామహులపై దాడులు చేస్తుందని ఆర్ఎస్ఎస్ను విమర్శించారు.
Singam Style Police: తమిళనాడులో సింగం సినిమాలో మాదిరిగా.. రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్‌ను పట్టుకునేందుకు ఓ ఎస్ఐ ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్లో సదరు ఎస్ఐ చివరకు ఫెయిల్ అయ్యాడు. అయితే, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.