Palnadu: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ లో దుండగులు చోరీకి యత్నించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. ఒక్కసారిగా భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే, పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్ళలో చోరీకి బీహార్, మహారాష్ట్ర గ్యాంగులు పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల్లో రెండు సార్లు చోరీకి యత్నించినట్లు పేర్కొన్నారు. తెల్లవారుజామున చోరీకి పాల్పడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగల బెడద నుంచి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు వెళ్లే విధంగా చూస్తామని తెలిపారు.