Hyderabad: బుద్ధిగా చదువుకోమని చెప్పడమే తల్లి అంజలి చేసిన నేరమైంది..!! కూతురు తేజశ్రీకి మాత్రం తల్లి చేష్టలు మరోలా అర్థమయ్యాయి !! మొదటి భర్తకు పుట్టిన కూతురును కాబట్టే నన్ను పట్టించుకోవడం లేదని, రెండో భర్త కూతురైన తన చల్లిపైనే ప్రేమ చూపిస్తోందని అనుకుంది తేజశ్రీ. తల్లి అడ్డు తొలగించుకుంటే.. ప్రేమించిన శివ తనకు దక్కడమే కాకుండా తల్లి పీడ విరగడవుతుందని భావించింది కూతురు. ప్రియుడు శివతో కలిసి ఏకంగా తల్లి హత్యకు స్కెచ్ వేసింది.
Read Also: Shefali Jariwala: నటి షెఫాలి జరివాలా మృతిపై ట్విస్ట్! పోలీసులు ఏం చెప్పారంటే..!
ప్రేమించిన యువకుడి వెంట వెళ్తే.. పట్టుకొచ్చారు. పెళ్లి చేయమంటే తల్లి కాళ్లు విరగ్గొడతా అంటోంది. ఎలాగే మొదటి భర్త కూతురును కదా అనే చిన్న చూపు…!! ఇలా తేజశ్రీ మదిలో రకరకాల ఆలోచనలు. ఇవన్నీ క్రూయల్ గా మారాయి. తల్లిపై కోపం కాస్తా… పగగా మారింది. తల్లే లేకపోతే.. నన్ను అడిగే వాళ్లే ఉండరుగా అనుకుంది తేజశ్రీ. తల్లి అడ్డుతొలగించుకోవాలని స్కెచ్ వేసింది. ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. తాను వేసిన స్కెచ్ ప్రియుడితో పంచుకుంది. షాక్ ఐన శివ.. తేజశ్రీ ప్లాన్ కి ఒప్పుకోలేదు. ససేమిరా అన్నాడు. కానీ.. తేజశ్రీ మరో డ్రామా అల్లింది. నువ్వు నా తల్లిని చంపకపోతే.. నేనే ఆత్మహత్య చేసుకుని నీ పేరు రాస్తానని బెదిరించింది. తేజశ్రీ బలవంతపెట్టడంతో.. అంజలి హత్యకు ఒప్పుకున్నాడు. ఇందుకు తన తమ్ముడు యశ్వంత్ సాయం కోరాడు.
Read Also: Bihar Elections: బీహార్‌లో యంగ్ ఓటర్లే అధికం.. ఈసారి ఎటువైపో..!
పక్కా ప్లాన్ ప్రకారం.. ఈనెల 23న తేజశ్రీ.. శివకి కాల్ చేసింది. అమ్మ ఇంట్లోనే ఉందని.. ఈరోజు సాయంత్రం హత్య చేసేందుకు సరైన సమయం అని చెప్పింది. దీంతో.. తమ్ముడు యశ్వంత్ తో కలిసి శివ నల్గొండ నుంచి జీడిమెట్ల చేరుకున్నాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తేజశ్రీ చెల్లి స్కూల్ నుంచి వచ్చి ట్యూషన్ కి వెళ్లింది. ఇదే అదునుగా భావించి శివ, యశ్వంత్ లను ఇంటి లోపలికి పిలిచింది. తేజశ్రీ బయటకు వెళ్లి.. ట్యూషన్ నుంచి చెల్లి రాకుండా చూసుకుంది. ఇంటి లోపలికి వెళ్లిన శివ, యశ్వంత్… అంజలి మెడకు చున్నీ చుట్టి బిగించారు. ఊపిరి ఆడకుండా చేశారు. అంజలి స్పృహ లేకుండా పడిపోవడంతో చనిపోయిందని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న చెల్లిని తేజశ్రీ.. గల్లీ వద్దే అడ్డగించింది. అమ్మ ఒక ఆంటీ దగ్గరికి వెళ్లి తనని తీసుకుని రమ్మని చెప్పిందని.. పదా వెళ్దాం అంటూ డైవర్ట్ చేసింది. కాసేపటికి శివ.. తేజశ్రీ కి కాల్ చేశాడు. మీ అమ్మను చంపేసాం.. వెళ్లిపోతున్నాం అని చెప్పాడు. దీంతో.. చెల్లిని తీసుకుని తేజశ్రీ ఇంటికి వెళ్లింది.
Read Also: Story Board: రియల్ ఎస్టేట్లో డౌన్ ట్రెండ్ కొనసాగుతుందా? కొనుగోలు శక్తి తగ్గిపోయిందా?
అక్కా చెల్లి ఇద్దరు ఇంట్లోకి వెళ్లగానే.. కిచెన్ లో స్పృహ లేకుండా పడి ఉన్న తల్లి కనిపించింది. తనకేం తెలియదు అన్నట్లుగా తేజశ్రీ నటించసాగింది. అమ్మ లే.. అమ్మ లే అంటూ ఏడ్చింది. చెల్లి బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా.. ఎవరికీ చెప్పకు.. వెళ్లి మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే తీసుకుని రా హాస్పిటల్ తీసుకెళదాం అని చెప్పింది. చెల్లి బయటకు వెళ్లింది. అంతలోపే అంజలి కాళ్లు, చేతులు కదిపింది. స్పృహ లోకి రాసాగింది. గమనించిన తేజశ్రీ.. వెంటనే శివకు కాల్ చేసింది. అమ్మ ఇంకా చనిపోలేదు. లేస్తోంది అని చెప్పింది. అమ్మ గనుక లేస్తే.. మన మర్డర్ ప్లాన్ తెలిసిపోతుందని.. మన ఖేల్ ఖతం అని చెప్పింది. వెంటనే శివ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. లేచే ప్రయత్నం చేస్తున్న అంజలిపై సుత్తె తో దాడి చేశాడు. మొహంపై, తలపై బలంగా బాదాడు. పక్కనే ఉన్న యశ్వంత్.. కత్తి తీసుకుని అంజలి పీక కోశాడు. చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్న తేజశ్రీ చెల్లి.. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి కేకలు పెట్టింది. వెంటనే చుట్టుపక్కల వాళ్లు గుమిగూడారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read Also: Crime News: కన్న తల్లినే హతమార్చేంత క్రూయల్‌గా మారిన కూతురు!
అంజలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. తేజశ్రీ చెల్లి చెప్తున్న వివరాల ప్రకారం.. అక్కను అనుమానించారు పోలీసులు. అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్ తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది తేజశ్రీ. అప్పటికే నల్గొండ పారిపోయిన శివ, యశ్వంత్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీడిమెట్ల పీఎస్‌కు తీసుకొచ్చారు.
Read Also: Ileana D’Cruz: రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. పిక్ వైరల్!
తేజశ్రీ వేసిన స్కెచ్ ప్రకారమే హత్య చేశామని నిందితులు శివ, యశ్వంత్ పోలీసులకు చెప్పారు. ఏ-1 గా తేజశ్రీ, ఏ-2 గా శివ, ఏ-3 గా యశ్వంత్ లపై కేసు నమోదు చేశారు జీడిమెట్ల పోలీసులు. నిందితులు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్‌కి తరలించారు. ఇంత జరిగినా.. నిందితుడు శివ తల్లి మాత్రం హాట్ కామెంట్స్ చేసింది. తన కొడుకు చేసింది సరైందేనని సమర్థించుకుంది. అంజలిని హత్య చేయడంలో తప్పేం లేదంటోంది. ముందు నుంచే బిడ్డను అదుపులో పెట్టుకోవాల్సిందని… తన కొడుకు వెంట తిరుగుతోందని తెలిసినా ముందు ఏం అనకుండా తర్వాత కట్టడి చేయడం వల్లే పిల్లలకు కోపం వచ్చి హత్య చేశారు అని సింపుల్ గా చెప్తోంది. ఇద్దరు కొడుకులు జైలుకు వెళ్లడం వల్ల తనకు ఏం టెన్షన్ లేదని.. ఈరోజు కాకపోతే రేపు.. కాకపోతే ఏదదో ఒక రోజు బయటకు వస్తారు కదా అంటోంది శివ తల్లి.