Warangal Congress Clash: హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి అనుచరులతో వచ్చిన కొండా మురళి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీకి ఆరు పేజీలతో కూడిన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను కమిటి ముందుకు రండి అని ఎవరు పిలవలేదు.. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చాను అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు.. ఆయనకు ప్రత్యేక వర్గం లేదని వెల్లడించారు. నేను పిలిచినా నా దగ్గరికి వస్తారు.. ఇక, భూపాలపల్లి నుంచి నేనే పోటీ చేద్దాం అనుకున్నాను.. కానీ, కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తుంది కాబట్టి.. నేను పోటీ చేయొద్దని అనుకున్నా.. అక్కడ నాకు బలం ఉంది.. టీడీపీ నుంచి వచ్చిన గండ్ర వెంకటరమణారెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించాను.. ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు అని కొండా మురళి ఆరోపించారు.
Read Also: Pawankalyan : ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ప్లానింగ్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. !
ఇక, సీతక్కతో మాకు ఎలాంటి పంచాయతీ లేదు.. సీతక్క, సురేఖ కలిసి పని చేసుకుంటున్నారు అని కొండా మురళి తెలిపారు. కానీ కడియం శ్రీహరి పార్టీ లోకి వచ్చాకా.. సీతక్క, సురేఖకి మధ్య గ్యాప్ వచ్చిందని కడియం ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. అలాగే, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి కూడా మేమే మద్దతిచ్చి గెలిపించాం.. విజయం సాధించిన తర్వాత మాకు వ్యతిరేకంగా గూడు పుఠాని రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. దీంతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఇందిరకు కడియం శ్రీహరి చుక్కలు చూపిస్తున్నాడు.. ఆమె వర్గీయులను కూడా టార్చర్ చేస్తున్నాడని తెలిపారు. 200 నుంచి 300 మంది కడియం వేధింపులు తట్టుకోలేక నాకు చెప్పారు.. నేను ఆయన నియోజకవర్గంలో ఇన్వాల్ కావడం లేదు.. కానీ, జిల్లాలో ఏం చేస్తున్నాడో యావత్ రాష్ట్రమంతా తెలుసు అన్నారు. ఇక, నన్ను ఎవరు పిలిచి ఈ విషయాలు చెప్పమని అడగలేదు.. మన పీసీసీ ప్రెసిడెంట్, బీసీ బిడ్డా మహేష్ కుమార్ మీద అభిమానంతో నేనే వచ్చి పార్టీకి వివరించాలని అనుకున్నాను.. అందుకే, స్వయంగా వచ్చి తెలియజేయడం జరిగిందని కొండా మురళి తెలిపారు.