Tadipatri Tension: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు.
Wife Killed Husband: నెల్లూరు జిల్లా రాపూరులో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్త శీనయ్యను భార్య ధనమ్మ కరెంట్ వైరుతో గొంతు బిగించి చంపేసింది. ఇక, భార్య ధనమ్మతో పాటు ప్రియుడు కల్యాణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 63, 897 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,500 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.66 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
CM Chandrababu: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు (జూలై 18న ) మధ్యాహ్నం 3 గంటలకు జరిగే అవకాశం ఉంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడి నివాసంలో ఈ మీటింగ్ ను ఏర్పాటు చేశారు.
BC Janardhan Reddy: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడాది పాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారి బాలికల చేత సిమెంట్ రోడ్డును ప్రారంభోత్సవ రిబ్బన్ కటింగ్ చేయించారు మంత్రి.
బీఆర్ఎస్లో కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయా? ఎమ్మెల్సీ కవిత ఇక పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనా? అంటే... మారుతున్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అమెరికా ట్రిప్ నుంచి వచ్చాక కవిత రాజకీయ కదలికల్ని నిశితంగా గమనిస్తున్నవారంతా... అదే అభిప్రాయంతో ఉన్నారట.
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. ఇద్దరు సీఎంలతో... కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన మీటింగ్ అనగానే... రెండు రాష్ట్రాల్లో ఒకటే ఉత్కంఠ. అందునా.... బనకచర్ల సెంట్రిక్‌గా...పొలిటికల్ పంచ్‌లు హాట్ హాట్‌గా పేలుతున్న వేళ ఆ ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయా?
హుజూరాబాద్.. పొలిటికల్‌గా తెలంగాణ మొత్తం మీద ప్రత్యేక గుర్తింపు ఉన్న కొద్ది నియోజకవర్గాల్లో ఒకటి. సీనియర్ లీడర్ ఈటల రాజేందర్‌కి నిన్న మొన్నటి దాకా కంచుకోట ఇది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో... గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ రెండింట్లో పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిపోయారాయన.