అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమం నిర్వహిస్తోంది టీడీపీ. నెల రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించాలన్నది ప్రోగ్రామ్ లక్ష్యం.
బొత్స సత్యనారాయణ.. ఉత్తరాంధ్రలో కీలక నేత.. అక్కడ వైసీపీకి పెద్ద దిక్కు. ఉమ్మడి రాష్ట్రంలోను, విడిపోయాక కూడా పవర్ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారాయన. ప్రస్తుతం వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగలిగిన కొద్దిమంది నేతల్లో ఆయన కూడా ఒకరు.
AP Deputy CM Pawan: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ( MGNREGS) యొక్క సోషల్ ఆడిట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
Vizag Drug Case: విశాఖ పట్నంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. అయితే, అరెస్ట్ చేసిన వారిలో సౌతాఫ్రికాకు చెందిన థామస్‌ను వారం రోజుల పాటు, అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా, డాక్టర్ కృష్ణ చైతన్యను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్టు చెప్పారు.
Minister Nadendla: విజయవాడలోని సివిల్ సప్లయ్ భవనంలో రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సమావేశం నిర్వహించారు. FCIకు సీఎంఆర్ 10 శాతం బ్రోకెన్ రైస్ సరఫరా చేయాల్సిన కీలక దశలో.. ఆంధ్రప్రదేశ్‌కు గోల్డెన్ ఛాన్స్ దక్కిందంటున్నారు.
Minister Anitha: కృష్ణా జిల్లాలో పర్యటించిన హోం మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసింది. కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని జగన్ చూస్తున్నారు అని ఆరోపించింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పర్యటనలను అడ్డుకున్నది మీరు కదా?.. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు.
Botsa Satyanarayana: పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆరోపించారు.
Rk Roja: చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఫిర్యాదు చేసింది. తనపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, అగౌరవంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని కోరింది.