Tadipatri Tension: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. పెద్దారెడ్డి వ్యాఖ్యలపై స్పందిచిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఆయన తాడిపత్రికి వస్తే అడ్డుకుంటామని జేసీ వర్గీయులు స్పష్టం చేశారు.
Read Also: HCA: హెచ్ సీఏలో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడి గుర్తింపు.. లక్షల్లో లబ్ధి పొందిన సభ్యులు
ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామమైన తిమ్మంపల్లిలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అలాగే, ఈ కార్యక్రమానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. తాడిపత్రికి వెళ్లవద్దని తెలిపే నోటీసులను పెద్దారెడ్డికి అందించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.