Tirumala Rush: కలియుగ వైకుంఠం తిరుమలలో రోజు రోజుకు భక్తుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఇక, వీకెండ్ వస్తుండటంతో తిరుమలలో స్వామి వారి దర్శనానికి వచ్చే వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 63, 897 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,500 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.66 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
మరోవైపు, రేపటి నుంచి ఆన్ లైన్లో అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల స్వామి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు లక్కీ డిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ కానున్నాయి. 21న తేదీన ఉదయం 10 గంటల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం ఉంది. 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిఫ్ విధానంలో సేవా టిక్కెట్లను టీటీడీ కేటాయించనుంది.