Gadikota Srikanth Reddy: సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధం అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా ఉన్నదే చంద్రబాబు.. ప్రజలను మభ్యపెడుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
CM Chandrababu: గ్రీన్ హైడ్రోజెన్ సమిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ ఆలోచనలు వినటానికి ఆవిష్కరణలు తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాను.. విద్యుత్ సంస్కరణలు దేశంలో తొలి సారి ప్రారంభించింది నేనే.
వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదు అని మండిపడ్డారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకుంటామంటే ఊరుకోము.. తాడిపత్రిలో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో ప్రభుత్వానికి జీవో జారీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గడపకు తీసుకెళ్లి బలోపేతం చేస్తామన్నారు.
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసు ఛార్జిషీటులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ పై ఈ కేసులో పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను కొట్టి వేసింది.
Minister Nimmala: విశాఖపట్నంలోని భీమిలి నియోజకవర్గంలో చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది..
వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన రాహుల్.. నా బావ రాబర్టుని ఈ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వెంటాడుతోంది అని ఆరోపించారు.
Pawan Kalyan: అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా దూసుకెళ్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047, వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధన దిశగా రాష్ట్రం శక్తివంతమైన అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
Tadipatri Tension: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు.