Golden Shawl: రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ తన ప్రత్యేక నైపుణ్యంతో మరోసారి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా త్రివిధ దళాల (సైన్యం, నౌకాదళం, వాయుసేన) చిత్రాలను బంగారు శాలువాపై నేసి తన దేశభక్తిని చాటుకున్నాడు.
KL Rahul vs Umpire: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
PM-Kisan: దేశంలోని రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6,000 పెట్టుబడి సాయంగా అందిస్తుంది. దీన్ని మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది.
Congress Legal Summit: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అనే థీమ్ పై సదస్సు జరగబోతుంది.
India: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు అనేక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఆయా అభ్యంతరం వ్యక్తం చేశాయి.
డొనాల్డ్ ట్రంప్ పోస్ట్‌ను ‘ఎక్స్’లో షేర్ చేసిన హర్ష్ గొయెంకా, భారత్‌కు పాకిస్థాన్ చమురును విక్రయిస్తారని చెప్పడమంటే టీ20 మ్యాచ్‌లో టెయిలెండర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడని చెప్పడమేనని ఎద్దేవా చేశారు. సాంకేతిక అంశాలను పక్కనబెడితే, వాస్తవ రూపంలో కూడా అది అసాధ్యమే అని ఆయన అన్నారు.
Mumbai: ముంబైకి చెందిన ఓ న్యాయవాది తన వంట మనిషికి రోజుకు 30 నిమిషాల పని కోసం నెలకు 18 వేల రూపాయల జీతం ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
IND- US Defense Deals: భారత్‌పై 25 శాతం టారీఫ్స్ తో పాటు పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అంతటితో ఆగకుండా భారత్, రష్యా బంధంపై తీవ్రంగా మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో భారత్ తీవ్ర నిరాశకు గురైంది.. దీంతో రక్షణ రంగ ఒప్పందాల ఆమోదం విషయంలో ముందుకు వెళ్లాలనుకోవడం లేదని అంతర్జాతీయ మీడియా కథనం బ్లూమ్‌బర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది
Karnataka: కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL)లో అటెండర్ గా పని చేసిన కలకప్ప నిడగుండి ఇంట్లో లోకాయుక్త సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో రూ.30 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి.
Rummy Row: అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే సభలో కూర్చొని రమ్మీ ఆడారంటూ మహారాష్ట్ర మంత్రి మాణిక్ రావ్ కోకాటేపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.