Mumbai: ముంబైకి చెందిన ఓ న్యాయవాది తన వంట మనిషికి రోజుకు 30 నిమిషాల పని కోసం నెలకు 18 వేల రూపాయల జీతం ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే, ఆయుషి దోషి అనే ఈ అడ్వకేట్ ఇంట్లో పని చేసే మహారాజ్ (కుక్) తాను నివాసం ఉండే కాంప్లెక్స్‌లోని సుమారు 10-12 ఇళ్లలో పని చేస్తాడని తెలిపారు. ఈ సందర్భంగా అతను సాధారణంగా కుటుంబ సభ్యులను బట్టి ఒక్కో ఇంట్లో సుమారు 30 నిమిషాలు గడుపుతాడని చెప్పుకొచ్చారు. ఇక, మహారాజ్ తన ప్రయాణానికి ఎక్కువ సమయం కేటాయిస్తాడు.. వంట చేసిన ప్రతీ ఇంట్లో ఉచితంగా ఆహారం, టీ అతడికి లభిస్తుంది.. అలాగే, సమయానికి జీతం కూడా అందుకుంటాడు.. ఇంకా ఎప్పుడైనా ఎలాంటి నోటీసు లేకుండా ఉద్యోగం వదిలి వెళ్లగల స్వేచ్ఛ అతను కలిగివున్నాడని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది.
Read Also: Bihar Elections: ఈ సాయంత్రం బీహార్ ఓటర్ లిస్ట్ విడుదల.. ఇదే అంశంపై లోక్‌సభలో రగడ
అయితే, తన వంటవాడి జీవితాన్ని కార్పొరేట్ ఉద్యోగి జీవితంతో పోల్చుతూ ఆయుషి దోషి హాస్యాత్మకంగా వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, 30 నిమిషాల ఉద్యోగానికి 18 వేలు? అతను AI ఉపయోగిస్తున్నాడా అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. పార్ట్ టైమ్ కుక్ కి 18 వేలు అంటే చాలా ఎక్కువ అని మరొకరు రాసుకొచ్చారు. కేవలం 30 నిమిషాల్లో ఏ ఆహారం వండుతారు? అని ఇంకో నెటిజన్ ప్రశ్నించారు. దీంతో నెటిజన్స్ వ్యాఖ్యలకు న్యాయవాది ఆయుషి దోషి స్పందిస్తూ.. ముంబై ప్రజలారా, లగ్జరీ ప్రాంతాలలో ఉండేవారు ఇలాంటి మహారాజులు వండే వంటలను ఇష్టపడతారు.. ఇంత మొత్తంలో వసూలు చేయడం సరైనదే అని వెల్లడించింది.
My Maharaj (Cook)
•Charges ₹18k per house
•Max 30 mins per house
•10–12 houses daily
•Free food & free chai everywhere
•Gets paid on time or leaves without a goodbye 😭Meanwhile I’m out here saying “gentle reminder” with trembling hands with minimum salary.🙂
— Adv. Ayushi Doshi (@AyushiiDoshiii) July 29, 2025