Karnataka: నెల జీతం 15 వేలు.. మాజీ అటెండర్ ఇంట్లో 30 కోట్ల ఆస్తులు బట్టబయలు!
- KRIDL మాజీ అటెండర్ నెల జీతం రూ. 15 వేలు..
- లోకాయుక్త సోదాల్లో 30 కోట్ల ఆస్తులు బట్టబయలు..
- మాజీ అటెండర్ కు 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి, బంగారం, వెండి స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL)లో అటెండర్ గా పని చేసిన కలకప్ప నిడగుండి ఇంట్లో లోకాయుక్త సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో రూ.30 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. ఇందులో 24 నివాస గృహాలు, 40 ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరు మీదనే కాకుండా అతని భార్య, ఆమె సోదరుడి పేర్లతో కూడా రిజిస్టర్ చేయించినట్లే సోదాల్లో తేలింది. అలాగే, 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కిలోగ్రాముల వెండి, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: AP Constable Results 2025: ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్స్ వీళ్లే..
Also Read
అయితే, లోకాయుక్త అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ ఉద్యోగి కలకప్ప నిడగుండి నెలకు రూ.15,000 జీతంతో పని చేశాడు. మాజీ KRIDL ఇంజనీర్ ZM చిన్చోల్కర్‌తో కలిసి, 96 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులను సృష్టించడం ద్వారా రూ. 72 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇక, తమకు వచ్చిన ఫిర్యాదుతో కోర్టు ఆదేశాలతో తనిఖీ చేయగా.. మాజీ అటెండర్ ఇంట్లో భారీగా ఆస్తులు బయటపడటం జరిగింది అన్నారు. ఇక, కొప్పల్ ఎమ్మెల్యే కె. రాఘవేంద్ర హిట్నాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తోంది.. అవినీతికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా సమగ్ర విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?