గతంలో హిందువులను టెర్రరిస్టులుగా అప్పట్లో యూపీఏ సర్కార్ చూపించింది అని ఆరోపించారు. పాకిస్థాన్ ఏజెంట్ లుగా యూపీఏ నేతలు మారారు.. హిందువుల్లో ఐక్యత తక్కువగా ఉంటుందనే అధికారంలో ఉండే పార్టీలు ఇలా చేస్తున్నాయని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ సైనికులు తమ ప్రాణాలకు తెగించి పని చేస్తారు అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
Bandi Sanjay: కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి పదవి నాకు వద్దని చెప్పలేదు, కావాలని నేను అధిష్టానాన్ని అడగలేదన్నారు. క్రమశిక్షణ గల బీజేపీ పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది..
బీజేపీ, మోడీలను ఓడించడానికి మేం తక్కువ కాదు.. రానున్న ఎన్నికల్లో మోడీ, బీజేపీని ఓడిస్తామని తెలంగాణ CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోనియాను ప్రధాని చేయాలని అందరూ కోరినా.. మన్మోహన్ సింగ్ కు అవకాశం ఇచ్చారు.. రాష్ట్రపతి అవకాశం వచ్చినా ప్రణబ్ ముఖర్జీకి ఛాన్స్ ఇచ్చారు.. త్యాగాలకు మారు పేరు గాంధీ కుటుంబం.. ప్రధాని, కేంద్ర మంత్రి పదవులు రాహుల్ గాంధీ తీసుకోలేదు.
అమెరికా అధ్యక్షుడు టెర్రరిజాన్ని వ్యతిరేకించారు.. కానీ పాకిస్తాన్ ను తప్పుబట్టలేదు అని నారాయణ పేర్కొన్నారు. ట్రంప్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా.. భారత ప్రధాని ఒక్కమాట మాట్లాడడం లేదు.. ట్రంప్ నేనే ఆపాను యుద్ధాన్ని అంటాడు.. మన ప్రధాని నోరు తెరవడు.. ఎందుకంత భయం.. బానిస లాగా ఎందుకు భావించడం అని అడిగారు.
Rahul Gandhi Fire On EC: దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఇవాళ జరుగుతున్న కాంగ్రెస్ న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను రాజును కాదు, రాజా కావాలని కోరుకోను.. రాజు కాన్సెప్ట్ కు నేను వ్యతిరేకం అన్నారు.
దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, 15 సీట్లతో మోడీ ప్రధాని అయ్యారు.. ఆ 15 సీట్లు లేకుంటే ప్రధాని పదవి మోడీకి దక్కేది కాదన్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయట పెడుతాం..మా దగ్గర 100 శాతం ఆధారాలున్నాయి.. రఫేల్ డీల్ లో పీఎంవోతో పాటు NSA జోక్యం చేసుకున్నాయి.. దీనికి సంబంధించి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని రాహుల్ గాంధీ తెలియజేశారు.
KTR: హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్టులో.. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా.. ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారని ఆరోపించారు.
Tesla Fined: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థ టెస్లాకు భారీ జరిమానా పడింది. 2019లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కారులోని ఆటోపైలట్ వ్యవస్థ లోపమే ప్రమాదానికి కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది.
Russia vs America: రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ వార్నింగ్ కు ప్రతిస్పందనగా.. ఆ దేశానికి చేరువలో సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అగ్రరాజ్యం మోహరించింది. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ మాట్లాడుతూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని చెప్పుకొచ్చారు.