Congress Legal Summit: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అనే థీమ్ పై సదస్సు జరగబోతుంది. విజ్ఞాన భవన్లో జరిగే సదస్సులో దేశంలోని పలు కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సదస్సులో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. లీగల్ సెల్ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక, సదస్సుకు కాంగ్రెస్ పాలిత సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అయితే, లీగల్ సెల్ సదస్సులో మొత్తం 41 ప్రసంగాలు ఉండనున్నాయి. మొత్తం 5 సెషన్లుగా సదస్సు జరగనుంది.
Read Also: Thank You Dear Review: “థాంక్యూ డియర్” రివ్యూ
కాంగ్రెస్ న్యాయ సదస్సును మొత్తం ఐదు సెషన్లు..
* సామాజిక న్యాయం & రాజ్యాంగం: సమానత్వం, సౌభ్రాతృత్వ భావనలు
* మతం & రాజ్యాంగం: నియంత్రణలు, మార్గదర్శకాలు
* అధికార విభజన, ప్రజాస్వామ్య బాధ్యత: సమాఖ్య వ్యవస్థ దిశ?
* న్యాయ స్వతంత్రత & రాజ్యాంగ సంస్థల అశక్తతపై చర్చ
* వాలెడిక్టరీ సెషన్: రాజ్యాంగ దిక్సూచి: ప్రజాస్వామ్య భారత పట్ల కాంగ్రెస్ నిబంధిత విధేయత.
Read Also: Astrology: ఆగస్టు 2, శనివారం దినఫలాలు
ఇలా న్యాయపరమైనటువంటి అంశాలపై జరిగే చర్చలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో పాటు మాజీ న్యాయమూర్తులు, న్యాయవేత్తలు, మానవ హక్కుల సంఘం కార్యకర్తలు పాల్గొననున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే, ఏ సదస్సు భారత ప్రజాస్వామ్య యాత్రలో ఒక కీలక ఘట్టమని, దేశ ప్రజాస్వామ్య పునాది విలువలకు మళ్లీ కట్టుబడి నిలబడాల్సిన సమయమని చెప్తున్నారు. ఇక, రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ లీగల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అభిషేక్ మను సింగ్వీ.. అయితేఈరోజు ఢిల్లీలో జరిగే సదస్సు పార్టీ సభ కాకుండా, దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకు అవసరమైన చర్చలకు అవకాశం కల్పించే బహుముఖ వేదిక అని సింగ్వీ తెలిపారు..