Juvenile Offenders Escape: బాల నేరస్తులు గోడ దూకేశారు.. !! అధికారుల కళ్లుగప్పి ఏకంగా తాళం పగులగొట్టుకుని పారిపోయారు. సైదాబాద్‌లో ఉన్న జువెనైల్ హోమ్ నుంచి ఐదుగురు బాల నేరస్తులు పరారయ్యారు. ట్విస్ట్ ఏంటంటే.. పారిపోయి 15 రోజులైనా పోలీసులు గానీ.. జువెనైల్ హోమ్ సిబ్బంది కానీ.. ఇంకా వారిని పట్టుకోలేదు.
Newly Married Women’s Suicides: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు..!! కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం వధువులకు.. నరకప్రాయంగా మారుతున్నాయి. పెళ్లి తర్వాత ఆ నరకంలో ఉండలేక.. కాళ్ల పారాణి ఆరక ముందే ఉసురు తీసుకుంటున్నారు. దీంతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో మరణ మృదంగం మోగుతోంది.
HDFC APK File Scam: సైబర్ నేరగాళ్లు ఈ మధ్యకాలంలో ఏపీకే ఫైల్స్‌తో పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు. వీటి సహాయంతో స్మార్ట్ఫోన్లను తమ కంట్రోల్లోకి తెచ్చుకుని డబ్బును దోచేస్తున్నారు. అయితే, ఈ తరహా ఫైల్స్ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తాజాగా హెచ్చరించింది.
Trump Tariff Warning India: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాడు. రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలను భారీగా పెంచబోతున్నట్లు స్పష్టం చేశారు.
India US Trade Dispute 2025: భారతదేశానికి చెందిన అల్యూమినియం, ఉక్కు, సంబంధిత ఉత్పత్తులపై అమెరికా టారీఫ్స్ విధించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం కింద చర్చలకు రావాలంటూ భారత్ చేసిన అభ్యర్థనకు అగ్రరాజ్యం ఒప్పుకోవడం లేదని లోక్‌సభలో కేంద్ర వాణిజ్యం- పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు.