Juvenile Offenders Escape: వీరి వయసు 16 నుంచి 17 ఏళ్లు.. ఏకంగా జైలు నుంచే పరార్..
- వారంతా వివిధ నేరాలు చేసి.. శిక్ష అనుభవిస్తున్న బాల నేరస్తులు..
- సత్ప్రవర్తన నేర్చుకునేలా వారిని జువెనైల్ హోమ్‌లో ఉంచారు..
- అలాంటి జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు..
- మిగతా బాలురు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి జువైనల్ సిబ్బంది..
- చుట్టుపక్కల వెతికినా దొరకని ఆచూకీ.. 15 రోజులవుతున్నా కనిపించని జాడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Juvenile Offenders Escape: బాల నేరస్తులు గోడ దూకేశారు.. !! అధికారుల కళ్లుగప్పి ఏకంగా తాళం పగులగొట్టుకుని పారిపోయారు. సైదాబాద్‌లో ఉన్న జువెనైల్ హోమ్ నుంచి ఐదుగురు బాల నేరస్తులు పరారయ్యారు. ట్విస్ట్ ఏంటంటే.. పారిపోయి 15 రోజులైనా పోలీసులు గానీ.. జువెనైల్ హోమ్ సిబ్బంది కానీ.. ఇంకా వారిని పట్టుకోలేదు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోల్లో ఉన్న ఐదుగురు బాలురు.. జువైనల్ హోమ్ నుంచి పరారయ్యారు. వీరి వయసు 16 నుంచి 17 ఏళ్ల వరకు ఉంటుంది. జులై 21న రాత్రి అంతా గ్రౌండ్ ఫ్లోర్‌లో భోజనం చేశారు. ఆ తర్వాత ఈ ఐదుగురు మైనర్ బాలురు ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్లారు. జువైనల్ హోమ్ అధికారుల కంట పడకుండా అక్కడ ఉన్న ఇనుప గ్రిల్స్ తాళం తొలగించారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు దారి పరారయ్యారు… స్పాట్..
Read Also: Hyderabad: వీకెండ్ వచ్చిందంటే చాలు… హైదరాబాద్ శివారు బాట పడుతున్న యువత..!
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఇక, ఐదుగురు బాలురు పారిపోయిన ఘటనపై జువైనల్ హోమ్‌లో ఉన్న మిగతా బాలురు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన జువైనల్ హోమ్ సిబ్బంది.. చుట్టు పక్కల అంతా వెతికారు. కానీ వారి ఆచూకీ ఎక్కడా లభించలేదు. ఐతే ఉదయం జువైనల్ హోమ్ అధికారులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు15 రోజులవుతున్నా వారి జాడ కనిపించలేదు. అటు పోలీసులు కానీ.. ఇటు జువైనల్ హోమ్ సిబ్బంది కానీ వారిని పట్టుకోలేకపోయారు. పారిపోయిన ఐదుగురిలో ముగ్గురు తెలంగాణకు చెందినవారు కాగా.. మిగతా ఇద్దరు ఏపీకి చెందిన వారు అని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి