Rahul Gandhi: భారత్ జోడో యాత్ర సమయంలో ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు నిన్న (ఆగస్టు 4న) మందలించింది. రాహుల్పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని, అతడు మాట్లాడిన మాటలు సరైనవేనంటూ ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.
సిరాజ్ ఫిట్నెస్ సీక్రెట్ను అతడి సోదరుడు మహ్మద్ ఇస్మాయిల్ రివీల్ చేశాడు. సిరాజ్ తన ఫిట్నెస్పై ఎక్కువగా నజర్ పెడతాడు.. జంక్ ఫుడ్ (పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్)కు చాలా దూరంగా ఉంటాడు.. సరైన డైట్ ప్లాన్ను ఫాలో అవుతాడు అని చెప్పుకొచ్చాడు, అలాగే, సిరాజ్ హైదరాబాద్లో ఉన్నా, బయట ఎక్కడున్నా బిర్యానీని చాలా తక్కువగా తింటాడు.. అది కూడా ఇంట్లో తాయారు చేస్తేనే తింటాడు అని వెల్లడించారు.
TMC vs BJP Tensions: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. బీజేపీ నాయకుడు సువేందు అధికారి కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో మెరుపు వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ధరాలీ గ్రామంపై జలప్రవాహం ఒక్కసారిగా విరుచుకుపడటంతో.. ఇప్పటి వరకు నలుగురు చనిపోయినట్లు సమాచారం. దాదాపు 60 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని తెలుస్తుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏమాత్రం పట్టించుకోలేదు. యాపిల్ కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా కుక్ మాట్లాడుతూ.. గత త్రైమాసికంలో కొనసాగిన వైఖరే భవిష్యత్ లో కూడా కొనసాగుతుందని తెలియజేశారు. యూఎస్ లో విక్రయమయ్యే ఫోన్లు దాదాపుగా భారత్లో తయారు చేసినవే అన్నారు.
Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోసారి ప్రకృతి ప్రకోపాన్ని చూపించింది. హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని గంగోత్రీ పరిధిలోని ధరావలి గ్రామంలో భారీ క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనతో కొండచరియలు విరిగిపడి గ్రామంపైకి దూసుకు రావడంతో ఒక్కసారిగా ఆ ఊరు మొత్తం తుడిచి పెట్టుకుపోయింది.
Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇవాళ (ఆగస్టు 5న) మధ్యాహ్నం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హస్పటల్ లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాసి విడిచినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Minister Satya Kumar: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు అన్నదానికి రుజువులు చూపించగలవా జగన్.. మీ హయంలో ఎన్ని హామీలు అమలు చేశారు.
Ballikurava Quarry Tragedy: బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో అంచు విరిగి పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతులు ఒరిస్సాకు చెందిన కార్మికులుగా గుర్తించారు.