Mirai VFX : టీజీ విశ్వప్రసాద్‌కు తెలుగులో ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్ఆర్ఐగా తెలుగు సినిమా మీద ఆసక్తి పెంచుకున్న ఆయన, తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి నిర్మాతగా 50 సినిమాలు దాదాపు పూర్తి చేశారు. అందులో కొన్ని వేరే నిర్మాణ సంస్థలతో కలిసి చేసిన సినిమాలైతే, చాలా వరకు ఆయన సొంత ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. నిజానికి ఆయన సినీ పరిశ్రమలో చాలా నష్టాలు ఎదుర్కొన్నారు. అయినా, మరోపక్క ఇతర బిజినెస్‌లు చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు.
Dhanush: ‘కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం […]
Maruthi: ఈ మధ్య కాలంలో త్రిబాణదారి బార్బరిక్ అనే సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పి, ఆ సినిమా దర్శకుడు చెప్పుతో కొట్టుకుని సంచలనానికి కేంద్ర బిందువుగా మారాడు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో అతను మాట్లాడుతూ, సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానన్నాడు. ప్రేక్షకులు పెద్దగా సినిమా మీద ఆసక్తి కనబరచకపోవడంతో, నిజంగానే చెప్పుతో కొట్టుకొని హాట్ టాపిక్ అయ్యాడు. నిజానికి ఈ సినిమాని ప్రజెంట్ చేసింది దర్శకుడు మారుతి. మారుతి టీం ప్రోడక్ట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల […]
Nithiin: ఈ మధ్య కాలంలో యంగ్ హీరో నితిన్‌కు సరైన హిట్ పడలేదు. ఆయన రాబిన్‌హుడ్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండగా, ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి వేణు ఎలదండి దర్శకత్వంలో ఎల్లమ్మ కాగా, మరొకటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో స్వారీ అనే సినిమా. అయితే, రాబిన్‌హుడ్ సినిమా డిజాస్టర్ కావడం, ఆ తర్వాత వచ్చిన తమ్ముడు అంతకు మించిన డిజాస్టర్ కావడంతో మార్కెట్లు వర్కౌట్ కాక, ఎల్లమ్మ సినిమా డ్రాప్ అయింది. […]
Kantara Chapter 1 : సినిమా పరిశ్రమలో ఒక కొత్త సంగీత సంచలనం ఆవిష్కృతం కాబోతోంది. నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు-గాయకుడు దిల్జిత్ దోసాంజ్, ‘కాంతారా’ ఫేమ్ డైరెక్టర్-నటుడు రిషభ్ షెట్టితో చేతులు కలిపి, ‘కాంతారా చాప్టర్ 1’ సంగీత ఆల్బమ్‌కు తన స్వరాన్ని అందించాడు. ముంబైలోని వై ఆర్ ఎఫ్ స్టూడియోలలో ఈ రికార్డింగ్ ప్రక్రియ పూర్తి చేసిన దిల్జిత్, ఈ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయస్పర్శిగా పంచుకున్నాడు. 2022లో విడుదలైన ‘కాంతారా’ చిత్రం దిల్జిత్‌ను […]
Mirai: తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో తేజ సజ్జా తన సూపర్ హీరో ఫాంటసీ చిత్రం 'మిరాయ్'తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం, కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹55.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి రోజు (డే 1) 'మిరాయ్' ₹27.20 కోట్లను రాబట్టగా, రెండో రోజు (డే 2) కలెక్షన్స్ మరింత ఊపందుకుని, తొలి రోజు కంటే ఎక్కువ వసూళ్లు నమోదు చేసింది. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్…
Sony Liv : 2025లో సోనీ లివ్ ఒరిజినల్స్, బ్లాక్‌బస్టర్ అన్ స్క్రిప్టెడ్ షోలు, అతిపెద్ద క్రీడా కార్యక్రమాలతో అందరినీ అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఉత్తేజకరమైన రాజకీయ నాటకాలు, అడ్రినల్ రష్ కలిగించే థ్రిల్లర్లు, హృదయాన్ని హత్తుకునేలా కుటుంబ గాథలు ఇలా ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని కట్టి పడిసేందుకు రకరకాల ప్రాజెక్టులతో సోనీ లివ్ రెడీగా ఉంది. ఇక క్రీడల విషయానికి వస్తే సోనీ లివ్ ప్రపంచంలోని గొప్ప టోర్నమెంట్లను నేరుగా మీ తెరపైకి తీసుకురానుంది. హిందీలో […]
తాజాగా విడుదలైన తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ట్రామా మర్చిపోయి ఊపిరి పీల్చుకుంటున్నారు. అదేంటి, తేజ సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవడం ఏంటి అని మీకు అనుమానం కలగవచ్చు. అసలు విషయం ఏమిటంటే, తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమా కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వప్రసాద్ స్వయంగా ఒక సీజీ కంపెనీ ప్రారంభించారు. ప్రొడక్షన్ కాస్ట్స్ తగ్గించుకునే పనిలో భాగంగా, ఆయనకు ఉన్న టెక్నికల్ స్కిల్స్ […]
Anushka : ఇటీవల అనుష్క ‘ఘాటీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా టాక్ యావరేజ్‌గా ఉన్నా, కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనుకబడింది. గంజాయి సాగు నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమాకు ఆశించిన మేర ఫలితాలు రాలేదు. అయితే, తాజాగా అనుష్క తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. “ట్రెడింగ్ బ్లూ లైట్ టు క్యాండిల్‌లైట్, కొన్నాళ్లపాటు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. Read Also : […]
Manchu Manoj: గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి వివాదాలు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లాయి. అయితే, తాజాగా మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన 'మిరాయ్' సినిమా రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ విషెస్ అందించాడు. అయితే, దానికి మంచు మనోజ్ ఆసక్తికరంగా స్పందించాడు.