ప్రియదర్శి హీరోగా, నిహారిక ఎన్.ఎం. హీరోయిన్‌గా, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్ కీలక పాత్రలలో నటించిన చిత్రం ‘మిత్రమండలి’. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాతో విజయేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే, ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయి, బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది.
Also Read:Kajal Aggarwal : వేకేషన్ మూడ్‌లో కాజల్ అగర్వాల్..భర్తతో రొమాంటిక్ మోమెంట్స్
దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా, ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే, దీనికి సంబంధించి సరికొత్త వెర్షన్‌ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని తాజాగా ఈ సినిమా నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు. రేపటి నుంచి అంటే నవంబర్ ఆరవ తేదీ నుంచి ఈ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా వివరించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన 28 రోజులలోపే ఓటీటీలోకి వచ్చేయడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలో మరోసారి ఓటీటీ విండో గురించి చర్చ జరుగుతోంది. ఇక కామెడీ ప్రధానంగా రూపొందించబడిన ఈ సినిమా కామెడీ ఎందుకో వర్కవుట్ కాలేదు.