Monalisa: మహా కుంభమేళాలో కొన్ని లక్షల మంది వ్యాపారాలు చేసి బాగుపడితే, ఒక అమ్మాయి మాత్రం ఏకంగా పూసలమ్ముతూ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఎవరో ఇప్పటికీ మీకు అర్థం అయిపోయి ఉంటుంది, ఆమె పేరు మోనాలిసా. కుంభమేళాలో పూసలమ్ముతూ తనదైన కళ్లతో అందరినీ ఆకట్టుకున్న ఆమె, సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమెను ఒక బాలీవుడ్ దర్శక-నిర్మాత ఇంటికి వెళ్లి మరీ అడ్వాన్స్ ఇచ్చి హీరోయిన్‌గా మార్చేశారు. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు, అది వేరే విషయం. తర్వాత షాప్ ఓపెనింగ్‌లు చేస్తూ బిజీ బిజీగా మారిన ఈ అమ్మడిని, ఈసారి ఏకంగా పాన్ ఇండియాలో హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు సిద్ధమైంది టాలీవుడ్.
READ MORE: Kartik Purnima 2025: పవిత్రత, భక్తి, దీపాల వెలుగులతో 2025 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..
మోనాలిసా హీరోయిన్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో సినిమా ప్రారంభోత్సవం ఈరోజు జరగబోతోంది. గతంలో ‘క్రష్’, ‘ఇట్స్ ఓకే గురు’ లాంటి సినిమాలలో హీరోగా నటించిన చరణ్ సాయి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్ మీద అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని నిర్మిస్తుండగా, గతంలో ఆది సాయికుమార్‌తో ‘లవ్ కే రన్’, ధనరాజ్, తాగుబోతు రమేష్‌తో ‘ఏకే రావు పీకే రావు’ సినిమా డైరెక్ట్ చేసిన శ్రీను కోటపాటి ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం మరికొద్ది సేపట్లో హైదరాబాదులో జరగబోతోంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు టీమ్ వెల్లడించే అవకాశం ఉంది.