నందమూరి బాలకృష్ణ, అలాగే థమన్ కాంబినేషన్ అంటేనే కచ్చితంగా చార్ట్బస్టర్లుతో పాటు ఆ సినిమా రీ-రికార్డింగ్ విషయంలో కూడా అనేక అంచనాలు ఏర్పడుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అలాంటి ట్రెండ్ సెట్ చేశాయి మరి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో రాబోతున్న ‘అఖండ 2’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమాకి సీక్వెల్‌గా ‘అఖండ తాండవం’ పేరుతో ఈ సెకండ్ పార్ట్ రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా […]
ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ కింగ్ నాగార్జున గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. బిగ్ బాస్ రియాల్టీ షో సెట్ లో నాగార్జునను కలిసి అసోసియేషన్ సినీ పాత్రికేయులకు, వారి కుటుంబాలకు అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీతో పాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు. ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు సభ్యుల ఉన్నతికి కృషి చేస్తామని నాగార్జున గారికి వివరించారు. సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం […]
అక్టోబర్ 31వ తేదీన ‘బాహుబలి: ఎపిక్’ పేరుతో బాహుబలి మొదటి భాగంతో పాటు రెండో భాగాన్ని మిక్స్ చేసి రాజమౌళి రీ-రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో రీ-రిలీజ్ సినిమాలతో పోలిస్తే, ఈ సినిమా బుకింగ్స్ ఒక రేంజ్లో అవుతున్నాయి. అయితే ఈ ట్రెండ్‌ను బట్టి పరిశీలిస్తే రెండు విషయాలు అవగతం అవుతున్నాయి. అందులో ఒకటి, రీ-రిలీజ్ సినిమాలు కూడా చూసి ఎంజాయ్ చేసేంత ఖాళీగా జనాలు ఉన్నారా అనేది ఒకటైతే, కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకు […]
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, మాస్ మహారాజ్ రవితేజ 75వ చిత్రం ‘మాస్ జాతర’తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనుంది. తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు […]
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘మాస్ జాతర’ విడుదల తేదీ విషయంలో ఒక ఆసక్తికర చర్చ నడిచింది. అక్టోబర్ 31న విడుదల కావాల్సిన ఈ సినిమా, అదే రోజున విడుదలవుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ ప్రభావం వల్ల నవంబర్ 1కు మారుతుందని అంతా భావించారు. ‘బాహుబలి ది ఎపిక్’ అంటే, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ ఈ రెండు భాగాలను కలిపి ఒకేసారి ప్రదర్శించడం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ అద్భుతంగా ఉండటంతో, […]
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. విడుదలైన 25 రోజులు దాటినా, ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబడుతూనే ఉంది. ముఖ్యంగా, హిందీలో ఇప్పటికీ రోజుకు 3 నుంచి 4 కోట్లు వసూలు చేస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం దాదాపు 900 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ‘కాంతార చాప్టర్ 1’ వసూళ్లు చూస్తుంటే, ఇది 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని అందరూ భావించారు. అయితే, […]
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సీక్వెల్స్ హవా నడుస్తోంది. కథను ఒక భాగంలో పూర్తి చేయలేకపోవడంతో, రెండు.. ఒక్కోసారి మూడు భాగాలకు కూడా వెళ్లిపోతున్నారు దర్శక-నిర్మాతలు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలందరూ సీక్వెల్స్ బాట పట్టారు. అయితే, వీరందరి కంటే సీక్వెల్స్ విషయంలో ముందున్న హీరో డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ ఏ సినిమాను ఓకే చేసినా, దానికి సీక్వెల్ ఉంటుందా అనే చర్చ మొదలవుతోంది. ప్రభాస్ వరుసగా సీక్వెల్స్ […]
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర తన నటనతో ప్రేక్షకులకు సుపరిచితం. 2012లో ‘అందాల రాక్షసి’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన నవీన్ చంద్ర, హీరోగానే కాక వివిధ పాత్రలలో మెప్పిస్తూ వచ్చారు. ముఖ్యంగా, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి పవర్ఫుల్ నెగెటివ్ పాత్రతో సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రానున్న ‘మాస్ జాతర’ చిత్రంలో నవీన్ చంద్ర మాస్ మహారాజ్ రవితేజకు ప్రతికూల పాత్రలో […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ సినిమా ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే బాబీ సినిమాకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్టింగ్ సహా క్యాస్టింగ్ వర్క్ జరుగుతోంది. ఒకరకంగా ప్రీ-ప్రొడక్షన్లో బాబీ టీమ్ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు […]
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మరోసారి ఫిర్యాదు చేశారు. తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ, దుర్భాషలాడుతున్న కొన్ని ‘X’ హ్యాండిల్ ప్రొఫైల్స్‌ను జతచేస్తూ ఆయన తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలకు సంబంధించి గతంలో సిటీ సివిల్ కోర్ట్ అనుకూలంగా తీర్పు ఇచ్చినా, ఇంకా కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని చిరంజీవి ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read:Khawaja Asif: […]