ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల అవుతుంది. అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క రిలీజ్ […]
Andhra king Thaluka: ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని సరైన హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు పీ దర్శకత్వం వహిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే ఇతర ప్రమోషనల్ స్టఫ్‌కి కూడా ఈ సినిమా విషయంలో మంచి రెస్పాన్స్ వస్తోంది. […]
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కార్తీ కీలకపాత్రలో నటిస్తున్నట్లు వార్తలు తెరమీదకు వచ్చాయి. బాబీ డైరెక్షన్లో రూపొంద పోతున్న సినిమాలో కార్తీక్ కూడా నటిస్తున్నట్లు దాదాపుగా కన్ఫామ్ అయినట్లే. అధికారికంగా ప్రకటించలేదు కానీ, టాలీవుడ్ వర్గాల్లో అందరికీ ఈ విషయం తెలుసు. అయితే, ఇక్కడే ఒక కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. అదేంటంటే, ఈ సినిమా కోసం కార్తీకి ఏకంగా 23 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట. వాస్తవానికి, ఇప్పటివరకు కార్తీ తమిళంలో అత్యధికంగా తీసుకున్నది 15 […]
పవన్ కళ్యాణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్టు రూపొందపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, నిజానికి విజయ్‌తో చేసిన ‘వారసుడు’ సినిమా తరువాత వంశీ పైడిపల్లి ఇప్పటివరకు ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఆయన ఆ మధ్య కాలంలో అమీర్ ఖాన్ కోసం ఒక కథ రాసుకున్నట్లు ప్రచారం జరిగింది. రాసుకోవడమే కాదు, ఆయన దగ్గరకు వెళ్లి వినిపించి కూడా వచ్చాడు. […]
అందమైన ప్రేమ కథగా ఎస్ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘ఓ.. చెలియా’ పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక […]
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కథానాయికగా నటిస్తూనే, నిర్మాతగా కూడా మారారు. ‘ట్రాలాలా’ (Tralala) పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత, తన స్వీయ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నేడు (సోమవారం) లాంఛనంగా ప్రారంభించారు. ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన తన స్నేహితురాలు నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమం సినీ వర్గాల్లో హాట్ […]
ఒకప్పుడు ఐమాక్స్ బయట సినిమా రివ్యూలు చెప్పిన లక్ష్మణ్ టేకుముడి హీరోగా మారాడు. రాధికా జోషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘ప్రేమ లేదని’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జి.డి.ఆర్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీని ఇన్ఫ్రా ఈ సినిమాను నిర్మిస్తుండగా, జి.డి. నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ ను ఆదివారం చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే, ఈ సినిమాను ఓ హార్ట్‌ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీగా […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ తన రెండో సినిమాను తాజాగా ప్రారంభించారు. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (తమిళ డబ్బింగ్) చిత్రంతో హీరోగా పరిచయమైన పవీష్, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ చిత్రంలో పవీష్ సరసన కథానాయికగా తెలుగు యూట్యూబ్ ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ నటిస్తుండటం విశేషం. తన జానపద పాటల ద్వారా యూట్యూబ్‌లో విశేష ప్రజాదరణ పొందిన నాగదుర్గ, ఈ […]
అనుకున్నంత అయింది. ఇప్పటివరకు నెమ్మదిగా సినిమాల రిలీజ్ డేట్ల మీద, సినిమాల అనౌన్స్మెంట్ల మీద పెత్తనం చెలాయిస్తూ వచ్చిన ఓటీటీ (OTT) సంస్థలు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి. ఇప్పటివరకు ఓటీటీ సంస్థలు ఒక సినిమాని దాదాపుగా అవుట్ రేట్‌కి కొనేసేవాళ్ళు. అంటే, కాంబినేషన్ బట్టి లేక మరే ఇతర క్రేజ్నో బట్టి ఒక సినిమాకి పది కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే, ఆ పది కోట్లు కట్టాల్సిందే. అడ్వాన్స్‌గా కొంత కట్టి, సినిమా ఓటీటీలో […]
Sandeep vanga: ఈ మధ్యకాలంలో దర్శకులు ఇతర దర్శకులు చేసే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించడం పరిపాటి అయిపోయింది. అలా ఈ మధ్యకాలంలో చాలామంది దర్శకులు తమ స్నేహితులు లేకపోతే తమకు బాగా దగ్గరైన హీరో, హీరోయిన్లు నటిస్తున్న సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ వస్తున్నారు. అయితే, అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా మాత్రం రష్మిక హీరోయిన్గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో నటించలేనని చెప్పినట్లు […]