Trikala : యాలో ఈ గుబులే ఏలో అంటున్న మహేంద్రన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్జున్ రెడ్డి, యానిమల్ పాన్ ఇండియా హిట్స్ తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న హర్షవర్దన్ రామేశ్వర్ … ఇప్పుడు మైథలాజికల్ జానర్ లో రూపొందుతున్న ‘త్రికాల’ సినిమా మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం నుంచి తాజాగా యాలో ఈ గుబులే ఎలో పాటని రిలీజ్ చేశారు. ఈ పాటలో హర్షవర్దన్ రామేశ్వర్ స్టైల్‌తో పాటు మెలడీకి ఉన్న డెప్త్ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. ఆయన మ్యూజిక్ ట్రీట్ ఈ పాటకి ప్రధాన బలం. ప్రతి బీట్‌లోనూ ఆయన ట్రేడ్‌మార్క్ ఇంటెన్సిటీ స్పష్టంగా వినిపిస్తూ, పాటకి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఇచ్చింది.
Also Read :Lokayukta court: మాజీ ఎమ్మెల్యే భూ ఆక్రమణ..! లోకాయుక్త కోర్టు సీరియస్
Also Read
ఇక అనురాగ్ కులకర్ణి వాయిస్ ఈ పాటకి ప్రాణం పోసింది అని చెప్పాలి. భావోద్వేగాల్ని సూటిగా హృదయానికి చేరేలా చెప్పగల ఆయన వాయిస్, పాటలోని లవ్ ఫీలింగ్‌ని మరింతగా ఎలివేట్ చేసింది. సాఫ్ట్ టచ్‌తో పాటు పవర్ ఉన్న వాయిస్ మాడ్యులేషన్‌తో అనురాగ్ మరోసారి తన వెర్సటిలిటీని నిరూపించాడు. రాకేందు మౌళి లిరిక్స్ క్యాచిగా వున్నాయి. మొత్తానికి ‘యాలో ఈ గుబులే ఎలో’ పాట హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ బ్రిలియన్స్‌కి, అనురాగ్ కులకర్ణి ఎమోషనల్ సింగింగ్‌కి పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా నిలుస్తోంది. ‘త్రికాల’ సినిమా ఆల్బమ్‌పై అంచనాలను మరింత పెంచేలా ఈ పాట ప్రత్యేకంగా నిలిచింది. సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రాఫీ సాంగ్ కి మరింత వైబ్ తీసుకొచ్చింది. రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా ‘త్రికాల’ సినిమాను మణి తెల్లగూటి తెరకెక్కిస్తున్నారు. సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!