హైదరాబాదులోని గచ్చిబౌలి నివాసంలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఏపీ ఎన్నికల సమయంలో ఆయన వైసీపీకి మద్దతు పలికారు. ఇక తర్వాతి పరిణామాల్లో రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించారు. ఏపీ సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేశారు. చంద్రబాబును కించపరిచేలా పోసాని కృష్ణ మురళి మాట్లాడారంటూ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు […]
కోట్లు పెట్టి సినిమాలు చేయనక్కర్లేదు.. కంటెంట్ ఉంటే చాలు అవే కోట్లు వచ్చి పడతాయ్ అని నిరూపిస్తోంది మాలీవుడ్. సస్పెన్స్, క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్న మల్లూవుడ్.. మరోసారి ఇదే జోనర్ చిత్రాలు తీసి హిట్స్ అందుకుంటుంది. జనవరిలో వచ్చిన స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ రేఖా చిత్రం.. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా అదే ఫ్లోలో ఉంది. మాలీవుడ్ స్టార్ […]
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అక్టోబర్ 31, 2024 న విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం […]
‘మిసెస్’ ప్రజెంట్ బాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ఓటీటీ మూవీ. ఎక్కడా చూసినా ఈ సినిమా గురించే చర్చ. ముఖ్యంగా ఫీమేల్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఇందులో ఫీమేల్ లీడ్‌లో యాక్ట్ చేసిన సాన్యా మల్హోత్రా టాక్ ఆఫ్ ది బీటౌన్‌గా మారింది. ఆమె నటనకు ఫిదా అయిన ఆడియన్స్ మంచి అప్లాజ్ ఇస్తున్నారు. సాన్యా గతంలో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ.. ఇది ఓ స్పెషల్ మూవీగా నిలిచింది అనడంలో సందేహం లేదు. దంగల్ మూవీలో […]
ఓ సినిమా కోసం ఎలాంటి మేకోవర్కైనా సై అనే హీరోల్లో ఫస్ట్ రోలో ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్. కానీ ప్రయోగాలు.. మేకోవర్స్ ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి కానీ కాసుల వర్షం కురిపించడం లేదు. లాస్ట్ ఇయర్ భారీ అంచనాలతో వచ్చిన తంగలాన్ ఎలాంటి రిజల్ట్ చూసిందో తెలుసు. అంతకు ముందు వచ్చిన కోబ్రా, మహాన్ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. వీటి మధ్యలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లు పూర్తిగా విక్రమ్ కథలు కాదు.. […]
గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. నూతన నటీనటులు, సీనియర్ యాక్టర్స్ కాంబోలో గుణ శేఖర్ ఓ ట్రెండీ టాపిక్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా సాగే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ మేరకు మేకర్లు అప్డేట్ ఇచ్చారు. యుఫోరియా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. యుఫోరియా టైటిల్ […]
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించాడు. మరికొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన మరో తెలుగు సినిమాలో ఎంపికైనట్లుగా తెలుస్తోంది. సాయి ధరంతేజ్ హీరోగా సంబరాలు ఏటిగట్టు అనే సినిమా తెరకెక్కుతోంది. హనుమాన్ నిర్మాతల నిర్మాణంలో రోహిత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. Kedar : నిర్మాత కేదార్ కుటుంబానికి అడ్వాన్స్ తిరిగిచ్చేసిన […]
ఆనంద్ దేవరకొండ హీరోగా గంగం గణేశా అనే సినిమా నిర్మాతగా వ్యవహరించిన కేదార్ సెలగంశెట్టి అనారోగ్య కారణాలతో దుబాయ్ లో మరణించిన సంగతి తెలిసిందే. కేదార్ నిర్మాతగా గతంలో విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అందుకుగాను హీరో విజయ్ దేవరకొండ సహా దర్శకుడు సుకుమార్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ రూపేనా అమౌంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పట్లో సినిమా పట్టాలెక్కే అవకాశం లేకపోవడం, తాజాగా కేదార్ కన్నుమూయడంతో ఆ […]
రీసెంట్ టైమ్స్‌లో కళ తప్పిన హిందీ బాక్సాఫీసుకు ఊపిరిపోశాడు విక్కీ కౌశల్. ఛావాతో విక్కీ.. అప్ కమింగ్ సినిమాలతో వస్తున్న హీరోలకు ఆశాకిరణమయ్యాడు. అంతేనా తన పాత రికార్డులు తానే చెరిపేసి.. సరికొత్తవి సృష్టిస్తున్నాడు. రీ విక్కీ కౌశల్.. ప్రజెంట్ దేశ వ్యాప్తంగా మార్మోగిపోతున్న నేమ్. ఇప్పటి వరకు అతడి నటనా ప్రస్తానం ఒక ఎత్తు అయితే.. ఛావాతో ఆయన ఇమేజ్ ఎవరెస్ట్ తాకుతోంది. ఛావాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీని చూసి చిన్నాపెద్దా అనే తేడా […]
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా “నారి”. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13-20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్నిచెబుతూ దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. “నారి” సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ […]