ఆనంద్ దేవరకొండ హీరోగా గంగం గణేశా అనే సినిమా నిర్మాతగా వ్యవహరించిన కేదార్ సెలగంశెట్టి అనారోగ్య కారణాలతో దుబాయ్ లో మరణించిన సంగతి తెలిసిందే. కేదార్ నిర్మాతగా గతంలో విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అందుకుగాను హీరో విజయ్ దేవరకొండ సహా దర్శకుడు సుకుమార్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ రూపేనా అమౌంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పట్లో సినిమా పట్టాలెక్కే అవకాశం లేకపోవడం, తాజాగా కేదార్ కన్నుమూయడంతో ఆ అమౌంట్ కుటుంబానికి అందచేసినట్టు తెలుస్తోంది.
Chhaava: తెలుగులో ‘ఛావా’.. గీతా ఆర్ట్స్ రిలీజ్?
అటు విజయ్ దేవరకొండ తో పాటు ఇటు సుకుమార్ కూడా ఈ నిమేరకు ర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ డబ్బు కుటుంబానికి ఇప్పుడు అందజేశారా గతంలోనే అందజేసే ప్రయత్నం చేశారా? అనే విషయం నందు క్లారిటీ లేదు. గతంలో కేదార్ ఒక డ్రగ్స్ కేసులో కూడా అనుమానితుడిగా వార్తల్లోకి ఎక్కాడు. అయితే అనారోగ్య కారణాలతో దుబాయ్ వెళ్లిన ఆయన గత కొంతకాలంగా అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది. నిన్న గుండెపోటు కారణంగా ఆయన కన్నుమూశారు. ఆయన సహనిర్మాతగా ముత్తయ్య అనే సినిమా కూడా తెరకెక్కింది అయితే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది..