Naari : “నారి” సినిమా కోసం రమణ గోగుల సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా “నారి”. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13-20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్నిచెబుతూ దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. “నారి” సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమా నుంచి మ్యూజిక్ సెన్సేషన్ రమణ గోగుల పాడిన ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే’ పాటను రిలీజ్ చేశారు.
వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డిపై ఈ పాటను చిత్రీకరించారు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టు మీద..పాటతో సెన్సేషన్ సృష్టించిన రమణ గోగుల ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే’ పాటను పాడటం విశేషం. వినోద్ కుమార్ విన్ను ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. మహిళా సాధికారత గొప్పదనం చెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న “నారి” సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ‘ఈడు మగాడేంట్రా బుజ్జి..’, ‘నిశిలో శశిలా..’ సాంగ్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే’ పాట కూడా పెద్ద హిట్ కాబోతోంది. ఆర్పీ పట్నాయక్, సునీత, చిన్మయి శ్రీపాద వంటి పేరున్న గాయనీ గాయకులు “నారి” చిత్రంలోని సాంగ్స్ పాడటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. 13-20 ఏళ్ల పిల్లలకు వారి తల్లిదండ్రులు తప్పక థియేటర్లలో చూపించాల్సిన చిత్రం “నారి” అని టీమ్ చెబుతోంది.
Also Read
- Tags
- Naari
- Ramana Gogula
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!