ఓ సినిమా కోసం ఎలాంటి మేకోవర్‌కైనా సై అనే హీరోల్లో ఫస్ట్ రోలో ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్. కానీ ప్రయోగాలు.. మేకోవర్స్ ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి కానీ కాసుల వర్షం కురిపించడం లేదు. లాస్ట్ ఇయర్ భారీ అంచనాలతో వచ్చిన తంగలాన్ ఎలాంటి రిజల్ట్ చూసిందో తెలుసు. అంతకు ముందు వచ్చిన కోబ్రా, మహాన్ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. వీటి మధ్యలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లు పూర్తిగా విక్రమ్ కథలు కాదు.. హిట్ క్రెడిట్ కూడా మణిరత్నం ఖాతాలోకి వెళ్ళిపోయింది. తంగలాన్ రిజల్ట్ నుంచి తేరుకున్న చియాన్.. ఇప్పుడు ఎక్స్ పరిమెంట్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చినట్లే ఉన్నాడు. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ వీర ధీర శూరన్2లో నార్మల్ లుక్కులో దర్శనమిస్తున్నాడు. చిన్నా ఫేం ఎస్‌యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఫక్తు యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది మూవీ. దుషారా విజయన్, ఎస్ జే సూర్య, సూరజ్ వెంజర మూడు మెయిన్ లీడ్స్. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వీర ధీర శూరన్ 2 ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ అజిత్ విదాముయర్చిని తీసుకు వస్తున్నాడని ఎనౌన్స్ చేయడంతో ఆ రేసు నుంచి తప్పుకున్నాడు. అజిత్ రాలేదు.. విక్రమ్ కూడా రాలేకపోయాడు.
Smartphones: చౌక ధరకే స్మార్ట్ ఫోన్లు.. రూ. 10 వేలలోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!
వీర ధీర శూరన్ 2 జనవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఫిబ్రవరి 6కి విదాముయర్చి స్లాట్ బుక్ చేసుకోవడంతో ఆ బరి నుండి కూడా తప్పుకుంది. ఇక ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మార్చి 27న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది వీర ధీరన్ శూరన్ 2. ఇది విక్రమ్ ఫ్యాన్స్‌కు పండగే కానీ.. సినీ ట్రేడ్ వర్గాలు.. నార్మల్ ఆడియన్స్ కాస్త టెన్షన్ తీసుకుంటున్నారు. రీజన్.. అదే రోజు మరో భారీ బడ్జెట్ మూవీ థియేటర్లలోకి రావడమే. వీర ధీర శూరన్ 2 రిలీజ్ డేట్ అంతకన్నా ముందే ఆ డేట్‌నే మాలీవుడ్ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ ఎంపురన్ లాక్ చేసుకుంది. హై ఓల్డేజ్, హై బడ్జెట్ మూవీగా వస్తోన్న లూసిఫర్ సీక్వెల్ మార్చి 27న పాన్ ఇండియా లెవల్లో తీసుకు వస్తున్నాం అంటూ ఎప్పుడో డేట్ స్లాట్ బుక్ చేసుకున్నారు మేకర్స్. ఈ విషయం తెలిసి కూడా చియాన్ తన మూవీ తీసుకు రావడం చూసి.. కావాలనే వార్‌కు దిగుతున్నాడా..? కాంపిటీషన్ లేకుండా సినిమాను దింపలేకపోతున్నాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉగాది సెలవులు కలిసి రావడం కూడా చియాన్ ఈ డేట్ కు మూవీని తీసుకురావాలని గట్టిగానే ఫిక్సయ్యాడు. అప్పుడు అజిత్ కు సైడిచ్చి మంచి సీజన్ వదులుకున్న విక్రమ్.. ఈసారి ఆ తప్పు చేయాలని అనుకోవడం లేదు. ఆరు నూరైనా సినిమాను తెచ్చేదే అని ఫిక్సయ్యాడట.