‘మిసెస్’ ప్రజెంట్ బాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ఓటీటీ మూవీ. ఎక్కడా చూసినా ఈ సినిమా గురించే చర్చ. ముఖ్యంగా ఫీమేల్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఇందులో ఫీమేల్ లీడ్‌లో యాక్ట్ చేసిన సాన్యా మల్హోత్రా టాక్ ఆఫ్ ది బీటౌన్‌గా మారింది. ఆమె నటనకు ఫిదా అయిన ఆడియన్స్ మంచి అప్లాజ్ ఇస్తున్నారు. సాన్యా గతంలో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ.. ఇది ఓ స్పెషల్ మూవీగా నిలిచింది అనడంలో సందేహం లేదు. దంగల్ మూవీలో బబిత కుమారీగా నటించిన సాన్యా.. కెరీర్ స్టార్టింగ్ లో సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ బిల్డ్ చేసుకుంది. బదాయి హో, శకుంతల దేవీ, లూడోలో స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఆ సినిమాలే ఆమెను మెయిన్ లీడ్ యాక్ట్రెస్‌గా మార్చాయి.
Veera Dheera Sooran 2: వీర ధీర శూరన్2 కి మోక్షం.. కావాలనే వార్?
పాగలైత్‌తో ఫీమేల్ లీడ్‌లోకి ఛేంజైన భామ.. కాథల్‌తో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సినిమాకే ఆమె లాస్ట్ ఇయర్ ఐకానిక్ గోల్డెన్ బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ చాయిస్ అవార్డు కొల్లగొట్టింది. ఇక అక్కడ నుండి టాప్ హీరోలతో జోడీ కడుతోంది భామ. శ్యామ్ బహుదూర్‌లో విక్కీ కౌశల్ భార్యగా, షారూఖ్ జవాన్‌లో కీ రోల్ చేసింది బ్యూటీ. కానీ ‘మిసెస్’ ఆమె ఇమేజ్ ని డబుల్ చేసింది. ఇక ‘మిసెస్’ ఇచ్చిన సక్సెస్ తో దూసుకెళుతోంది ఈ రింగుల భామ. ప్రజెంట్ అమ్మడి చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వరుణ్ ధావన్ సన్నీ సంస్కారీ కి తులసి కుమారితో పాటు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో మరో మూవీ చేస్తోంది. అలాగే రాజ్ కుమార్ రావుతో టోస్టర్ లో కనిపించబోతుంది. మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ థగ్ లైఫ్ తో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది ఈ నయా సెన్సేషన్. మరీ సడెన్లీ పాపులారిటీ తెచ్చుకున్న సాన్యా తన ఇమేజ్ ఎంత వరకు కాపాడుకుంటోందో..? చూడాలి