Chhaava: తెలుగులో ‘ఛావా’.. గీతా ఆర్ట్స్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ టైమ్స్‌లో కళ తప్పిన హిందీ బాక్సాఫీసుకు ఊపిరిపోశాడు విక్కీ కౌశల్. ఛావాతో విక్కీ.. అప్ కమింగ్ సినిమాలతో వస్తున్న హీరోలకు ఆశాకిరణమయ్యాడు. అంతేనా తన పాత రికార్డులు తానే చెరిపేసి.. సరికొత్తవి సృష్టిస్తున్నాడు. రీ విక్కీ కౌశల్.. ప్రజెంట్ దేశ వ్యాప్తంగా మార్మోగిపోతున్న నేమ్. ఇప్పటి వరకు అతడి నటనా ప్రస్తానం ఒక ఎత్తు అయితే.. ఛావాతో ఆయన ఇమేజ్ ఎవరెస్ట్ తాకుతోంది. ఛావాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీని చూసి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఎమోషనల్ అవుతున్నారు. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా ఈ డ్రై సీజన్లో కూడా కోట్లు కొల్లగొడుతుంది.
Yash: హాలీవుడ్ మీద కన్నేసిన యష్
Also Read
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
రియల్ లైఫ్ స్టోరీలకు ప్రాణంపోసి.. మరోసారి వారి ఉనికిని చాటుతున్నాడు విక్కీ కౌశల్. ఉరిలో మేజర్ విహాన్ సింగ్, సర్దార్ ఉద్దమ్‌లో ఉద్దమ్ సింగ్, శ్యామ్ బహుదూర్ లో శ్యామ్ మనేక్షాగా ఆయన నటన అద్భుతం. ఇప్పుడు శంభాజీగా టాప్ నాచ్ ఫెర్మామెన్స్. అందుకే ఆడియన్స్ ఈ సినిమాపై కాసుల వర్షం కురిపిస్తున్నారు. డైరెక్టర్ లక్ష్మన్ ఉట్కేకర్ ఛావాతో విక్కీ ఖాతాలో బ్లాక్ బస్టర్ అందించాడు. ఈ సినిమాతో ఓల్డ్ రికార్డులు చెరిపేసి సరికొత్తవి సృష్టిస్తున్నాడు విక్కీ. అందిన సమాచారం వరకు ఈ సినిమా 300 కోట్ల నెట్ కలెక్షన్లను క్రాస్ చేసి.. విక్కీ కెరీర్ లోనే హయ్యెస్ట్ నెట్ వసూలు రాబట్టుకున్న మూవీగా నిలిచింది.
ఇక్కడే కాదు.. ఓవర్సీస్‌లో కూడా సినిమా మంచి కలెక్షన్లు రాబట్టుకోగలుగుతుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 కోట్లను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఉరి పేరిట ఉన్న రికార్డులను చెరిపేసి.. హిస్టరీని క్రియేట్ చేసినట్లయ్యింది. సోలో హీరోగా విక్కీ కెరీర్‌లో ఉరి రూ. 342 కోట్లను వసూలు చేసింది. ఈ లెక్కన విక్కీ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది ఛావా. అంతేనా అత్యంత వేగంగా రూ. 300 నెట్ కలెక్షన్లు వసూలు చేసిన 8వ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఈ మంత్ ఎండింగ్ వరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్‌కు లేకపోవడంతో మరికొన్ని రికార్డులు క్రియేట్ చేసేటట్లే కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను హిందీలో చుసిన కొంత మంది తెలుగులో చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదిక పిటిషన్లు కూడా నమోదు చేశారు ఈ నేపథ్యంలో సినిమాని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది మార్చి 7వ తేదీన చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ఆ రోజు సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ చేసే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
#Chhaava in Telugu releasing on March 7th by @GeethaArts Distributors #HarHarMahadevॐ #VickyKaushal #chatrapatisambhajimaharaj #ChatrapatiShivajiMaharaj pic.twitter.com/79qAYm65nB
— The Cult Cinema (@cultcinemafeed) February 26, 2025
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!