గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. నూతన నటీనటులు, సీనియర్ యాక్టర్స్ కాంబోలో గుణ శేఖర్ ఓ ట్రెండీ టాపిక్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా సాగే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ మేరకు మేకర్లు అప్డేట్ ఇచ్చారు. యుఫోరియా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
యుఫోరియా టైటిల్ గ్లింప్స్, కాన్సెప్ట్ తెలియజేసేలా వదిలిన వీడియో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో విఘ్నేశ్ గవిరెడ్డి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా సీనియర్ నటి భూమిక ఇందులో ముఖ్య పాత్రలో కనిపించబోతోన్నారు. సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనిక రెడ్డి వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. షూట్ పూర్తి అంటూ మహా శివరాత్రి సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఇక త్వరలోనే ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు.