గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా అయిన RC16 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ మరియు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కలిసి ఓ హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశం సినిమాలో కీలక భాగంగా ఉంటుందని, దీన్ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
Varalakshmi : ఆరుగురు లైంగికంగా వేధించారు.. వరలక్ష్మీ షాకింగ్ కామెంట్స్
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ జరుగుతూ ఉండగా, ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు మరింత ఉత్కంఠ జోడిస్తుందని భావిస్తున్నారు.