అనూహ్యంగా దిల్ రాజు మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తాజాగా జరిగిన మోహన్ లాల్ సినిమా L2: ఎంపురాన్ ఈవెంట్‌లో గేమ్ చేంజర్ ప్రస్తావన రావడంతో ఒక్కసారిగా ఆడియన్స్ నుంచి పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వినిపించాయి. కొంతమంది గట్టిగా నవ్వేశారు. దీంతో స్టేజ్ మీద ఉన్న దిల్ రాజు కూడా నవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన సీరియస్ అవ్వలేక నవ్వేశాడు. కానీ కెమెరాలో మాత్రం గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ అనే మాట వినగానే దిల్ రాజు నవ్వినట్టుగా అనిపించింది. దీంతో సోషల్ మీడియాలో దిల్ రాజు మీద ట్రోలింగ్ మొదలైంది.
RC 16: యాక్షన్ సీక్వెన్స్ లో బిజీగా చరణ్?
సొంత సినిమా సక్సెస్ అయితే తమ క్రెడిట్ అన్నట్టు, ఫెయిల్ అయితే దర్శకుడి ఫెయిల్యూర్ అన్నట్టు ఇలా నవ్వడం కరెక్ట్ కాదంటూ ఆయన మీద పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా దిల్ రాజు ఇలా చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యనే తమన్ కూడా ఇదే విధమైన కామెంట్ చేయడంతో ఆయన్ని కూడా టార్గెట్ చేసి సోషల్ మీడియా యూజర్లు ఆడుకున్నారు. అయితే తాజాగా దిల్ రాజు తప్పు లేకపోయినా ఈ రోజు కార్నర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిజానికి గేమ్ చేంజర్ సినిమాకు ఈ రోజు జరిగిన ఎంపురాన్ ఈవెంట్‌కు ఏ మాత్రం సంబంధం లేదు. కానీ దిల్ రాజు గేమ్ చేంజర్ నిర్మాత కావడం, ఈ సినిమాను రిలీజ్ చేస్తూ ఉండడంతో ఆ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత, కేవలం ఎంపురాన్ సినిమా గురించి మాత్రమే మాట్లాడాలని జర్నలిస్టులను ఆయన కోరారు.