O Andala Rakshasi : ‘ఓ అందాల రాక్షసి’కి పాజిటివ్ టాక్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ మార్చి 21న ‘ఓ అందాల రాక్షసి’ అంటూ అందరి ముందుకు వచ్చారు. షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో తెరకెక్కించారు. మార్చి 21న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రైటర్ భాష్య శ్రీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా జనాల్లోకి మరింతగా రీచ్ అవ్వాలి. మీడియా సపోర్ట్ ఉంటే ఈ సినిమా మరింత ముందుకు వెళ్తుంది. షెరాజ్ ఈ మూవీని నిలబెట్టేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. నా రైటింగ్, స్క్రీన్ ప్లేని అందరూ మెచ్చుకుంటున్నారు. మా చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.
షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’మంచి సందేశం ఇచ్చేలా ఉందని ప్రేక్షకులంతా ప్రశంసిస్తున్నారు. మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్. మా మూవీ మరింత పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.కృతి వర్మ మాట్లాడుతూ .. ‘మా సినిమాతో పాటుగా చాలా చిత్రాలు వచ్చాయి. ఆడియెన్స్ మా మూవీని ఆదరించారు. ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ అందరికీ థాంక్స్. నా తొలి చిత్రమే ఇంత పెద్ద హిట్ అవ్వడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. విహాన్షి హెగ్డే మాట్లాడుతూ .. ‘నా ఫ్యామిలీతో కలిసి సినిమాను చూశాను. థియేటర్లో మా చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
-
West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
-
Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
-
NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
-
Hyderabad: లవ్ ఫెయిల్యూర్‌తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!