ఆ పక్క నాధే ఈ పక్క నాధే
తల పైనా ఆకాశం ముక్క నాదే
ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే
తప్పొప్పులు తాగాలెట్టే నిప్పు నేనే
నన్నైతే కొట్టేటోడు భూమిదే పుట్టలేదు
పుట్టాడ అది మల్ల నేనే
నను మించి యేధిగేటోడు
ఇంకోడు ఉన్నాడు సూడు
ఎవడంటే అది రేపటి నేనే అని పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ఇప్పుడు అదే సాంగ్ నిజం చేయడానికి రెడీ అయ్యాడు డైరెక్టర్ అట్లీ. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ దుబాయ్‌లో ఉన్నారు, అక్కడ కథా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆయన త్వరలో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారని అంటున్నారు.
Betting Apps : పోలీసుల కీలక చర్య.. భయ్యా సన్నీ యాదవ్‌పై లుక్‌ఔట్ నోటీసులు
ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని, దాదాపు విలన్‌కు సమానమైన పాత్రగా ఉంటుందని తెలుస్తోంది. అంటే, ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రలు రెండూ అల్లు అర్జున్‌నే కానున్నాయన్నమాట. ఇలాంటి పాత్రలు చేయడం స్టార్ హీరోలకు ఒక ఛాలెంజ్‌గా పరిగణించాలి. ‘పుష్ప’లో కూడా అల్లు అర్జున్ పాత్రలో కొంత నెగిటివ్ షేడ్ కనిపించింది కాబట్టి, ఈ కొత్త పాత్ర కోసం ఆయన పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదేమో. అయితే, తనతో తానే పోటీ పడటం అంటే ఆసక్తికరంగా ఉంటుంది.