పుష్ప : అల్లు అర్జున్, ఫహద్ మధ్య హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్…!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, ధనంజయ్, ప్రకాష్ రాజ్, హరీష్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్ల కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మొదటిసారిగా గిరిజన యువతి పాత్రను పోషిస్తోంది. 2021 మార్చి మూడవ వారంలో ‘పుష్ప’ కోసం మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన విరోధిగా మారబోతున్నారని ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఫహాద్ ఫాసిల్ ఆగస్టు నెలలో “పుష్ప” సెట్స్‌లో చేరనున్నారు.

Read Also : అల్లరి నరేష్ “సభకు నమస్కారం”లో మరో యంగ్ హీరో

సుకుమార్ ఇప్పుడు ప్రధాన షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నాడని, ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్… ఫహద్ ఫాసిల్ మధ్య హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఫహద్ ఫాసిల్ అవినీతి పోలీసుగా నటిస్తున్నట్లు కూడా వార్తలు విన్పిస్తున్నాయి. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఫహద్ సుకుమార్ వివరించిన స్క్రిప్ట్ తనకు ఎంతో నచ్చిందని చెప్పాడు. దర్శకుడి మునుపటి చిత్రం ‘రంగస్థలం’ తనకు అద్భుతంగా అన్పించిందని అన్నారు. ఇక ‘పుష్ప’లో తన పాత్ర చాలా ఫ్రెష్ గా ఉందని, ఇంతకు ముందు ఇలాంటిది చేయలేదని చెప్పాడు. దీంతో ఆ యాక్షన్ సీన్ తెరపై ఎలా ఉంటుందా ? అని ఇప్పుడే ఊహించుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-