మరో సారి వైసీపీ గెలవాలి.. రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన కొనసాగాలి అని ఆకాక్షించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. పల్నాడు పర్యటనలో ఉన్న ఆయన.. మంచి చేసిన ప్రభుత్వ పని తనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.. మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.890 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.. ప్రభుత్వం నుండి నేరుగా లక్ష మందికి పైగా లబ్ధి పొందారని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమమన్వయం ఉంటుందని స్పష్టం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి... కేంద్రాన్ని రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉంటుందన్నారు.. పార్టీ వేరు, ప్రభుత్వం వేరన్న ఆయన.. రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయని పేర్కొన్నారు.
Foreign Exchange: కరోనా ప్రపంచదేశాలను అతలాకుతలం చేసింది.. మళ్లీ కొన్ని దేశాలు మినహా చాలా దేశాల్లో సాధారణ పరిస్థితులు సారవడంతో.. విదేశీయానం పెరిగింది.. భారత్‌కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. విదేశీ పర్యాటకుల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఒక లక్షా 34 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభించిందని పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు..…
AP 3 Capitals: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం.. అసలు రాజధానులు ఎక్కడ పెట్టాలనేది రాష్ట్రాల ఇష్టం అని తెలిపారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన విజయసాయి రెడ్డి.. ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, జనాభా ప్రాతిపదికపై బీసీలకు రిజర్వేషన్లు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు ,విశాఖ మెట్రో అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఏపీలో మూడు…
AP Special Status: కాంగ్రెస్, బీజేపీ సంయుక్త వైఫల్యాల వల్లే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది అంటూ రాజ్యసభలో మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన విజయసాయి రెడ్డి.. ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, జనాభా ప్రాతిపదికపై బీసీలకు రిజర్వేషన్లు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు ,విశాఖ మెట్రో అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశారు విజయసాయి…
రాజ్యసభ ప్యానల్‌వైస్ చైర్మన్‌గా మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని నియమించారు.. అయితే, 10 రోజుల క్రితం సాయిరెడ్డిని.. వైస్ చైర్మన్‌గా నియమించినా.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో.. ఆయన పేరు తొలగించారు. అయితే, ఇప్పుడు మళ్లీ రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు.. సాయిరెడ్డితో పాటు.. పీటీ ఉషను కూడా ప్యానల్‌వైస్ చైర్మన్‌గా నియమిస్తూ.. రాజ్యసభలో ప్రకటించారు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్.. దీంతో.. విజయసాయి రెడ్డి, పీటీ…
చంద్రబాబు, లోకేష్‌ఖు నిజంగా ఇదే ఆఖరి ఎన్నిక అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన… చంద్రబాబు ఏం చేసినా డ్రామానే అంటూ మండిపడ్డారు.. అసలు తన 14 ఏళ్ల పాలనా కాలంలో బీసీలకు చంద్రబాబు ఏం చేశాడు? అని నిలదీశారు.. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌లో 11 మంది మంత్రివర్గ సభ్యులు బీసీలే ఉన్నారు.. కానీ, చంద్రబాబు సమయంలో అలాంటి పరిస్థితి లేదన్నాఉ.. తన…
అవకాశం దొరికితే.. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు నారా లోకేష్‌పై సెటైర్లు వేయానికి సిద్ధంగా ఉంటారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు మరోసారి నారా లోకేష్‌ను టార్గెట్ చేసిన ఆయన.. తాజాగా, లోకేష్ తీస్తున్న ఓ సెల్ఫీకి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పంచ్‌లు వేశారు.. ”ఇదేంటి బోకేష్! అక్కడ ఫోన్ ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ అంత ఎత్తులో పెడితే…
ఏపీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ పెరిగిన ధరలు, ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. అర్జంటుగా సైకియాట్రిస్టుకో, బూతవైద్యుడికో చూపించండయ్యా.. ముసలాడికి (చంద్రబాబు) మెంటలో, గాలి సోకిందో, మతిపోయిందో తెలియట్లేదు అంటూ సెటైర్లు వేశారు. కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న…