Jyothula Chanti Babu: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. దమ్ము ఉంటే జ్యోతుల నెహ్రును జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించాలని సవాల్ చేశారు.. ఎవడో రాసిన స్క్రిప్ట్ చంద్రబాబు చదివాడని మండిపడ్డ చంటిబాబు.. ఎన్టీఆర్ ని మింగేసిన అనకొండ చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. 2009లో టీడీపీని జ్యోతుల నెహ్రు భ్రష్టు పట్టించారని విమర్శించారు.. ఇక, చంద్రబాబు ని నమ్మి మోసపోయిన వాళ్లలో నేను కూడా ఒకడిని అంటూ గుర్తుచేసుకున్నారు.. పార్టీని కాపాడిన వారిని చంద్రబాబు వదిలేశాడు.. బొడ్డు భాస్కర రామారావు మనస్థాపంతో చనిపోయారని ఆరోపించారు.. బ్యాంక్ లకు కన్నాలు వేసిన వారిని దగ్గర పెట్టుకుని చంద్రబాబు తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పార్టీ మారినప్పుడు జ్యోతుల నెహ్రు డబ్బులు తీసుకున్నాడా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. కాగా, నిన్న గోకవరంలో పర్యటించారు చంద్రబాబు.. తన పర్యటనను విజయవంతం చేశారంటూ జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతులనెహ్రూను చంద్రబాబు అభినందించారు. ఇక, తన పర్యటనలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలు ఈ రోజు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.
Read Also: Adipurush: ఇది దేశం గర్వించే సినిమా అవుతుంది- కృతి సనన్