ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, ఈ జనరేషన్ కి ఫస్ట్ పాన్ ఇండియా హీరో అయ్యాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ తన కెరీర్ కి గోల్డెన్ ఫేజ్ లో ఉన్నాడు. ఈ రెబల్ స్టార్ ఫ్లాప్ సినిమా కూడా కొందరు స్టార్ హీరోల హిట్ సినిమా రేంజులో కలెక్షన్స్ ని రాబడుతుంది అంటే ప్రభాస్ మార్కెట్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు గ్యాప్ తీసుకోని సినిమాలు చేసే ప్రభాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తున్నాడు. అయిదేళ్లకి ఒక సినిమా రిలీజ్ చేస్తూ వచ్చిన ప్రభాస్, ఈ ఇయర్ రెండు సినిమాలని విడుదలకి రెడీ చేస్తున్నాడు. ఇందులో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవనుంది. ఈ మూవీ రిజల్ట్ పై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు కానీ అందరి భయం ‘ఆదిపురుష్’ గురించే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో విమర్శలు రావడంతో మేకర్స్ ఆదిపురుష్ సినిమాపై రీవర్క్ చేస్తున్నారు.
ప్రభాస్ శ్రీ రామునిగా నటిస్తున్న ఈ మూవీ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది తప్పకుండ ఇండియా గర్వించదగ్గ సినిమా అవుతుంది అని భరోసా ఇచ్చింది సీతాదేవి పాత్రలో నటిస్తున్న హీరోయిన్ కృతి సనన్. బాలీవుడ్ లో మోస్ట్ హ్యపెనింగ్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న కృతి సనన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘షెహజాదా’. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ మూవీ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకి రీమేక్ వర్షన్. ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానున్న షెహజాదా ప్రమోషన్స్ లో ఇంటర్వూస్ ఇస్తూ బిజీగా ఉన్న కృతి సనన్, ఒక ఇంటర్వ్యూలో ఆది పురుష్ సినిమా గురించి మాట్లాడుతూ… #AdiPurush is Film that I’m extremely proud of, I’m hoping that whole Country will be eventually proud of it! అని చెప్పింది. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి, కృతి సనన్ ఇచ్చిన ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.