టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటును జనసేనకి కేటాయించడం ఖాయమన్న చంటిబాబు.. ఆర్థికంగా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ తనకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రతిపాదన పెట్టారట.. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు జనసేనలో కాకినాడ ఎంపీగా పోటీ చేసేవారు ప్రస్తుతానికి ఎవరూ లేరని.. ఎవరు పోటీ చేసిన బయట నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేయడం తప్పదని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట..
పవన్ కల్యాణ్‌తో సమావేశంపై అనుచరులతో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిచారు.. అందుకే వెళ్లి కలిసినట్టు చెప్పుకొచ్చారు.. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నారని తెలిపారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పుడు జనసేన పార్టీకి టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన సమావేశం అయినట్టు సమాచారం.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ కష్టమని పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం ఉందట.. దీంతో.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు..
Jyothula Chanti Babu: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. దమ్ము ఉంటే జ్యోతుల నెహ్రును జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించాలని సవాల్ చేశారు.. ఎవడో రాసిన స్క్రిప్ట్ చంద్రబాబు చదివాడని మండిపడ్డ చంటిబాబు.. ఎన్టీఆర్ ని మింగేసిన అనకొండ చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. 2009లో టీడీపీని జ్యోతుల నెహ్రు భ్రష్టు పట్టించారని విమర్శించారు.. ఇక, చంద్రబాబు…
గత నెల 19న డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. మధ్యలో ఆ నాలుగు రోజులపాటు ఎమ్మెల్సీ పెళ్లిళ్లు, పేరంటాలుకు తిరుగుతూ పెద్ద హంగామానే చేశారు. అరెస్ట్ తర్వాత అనంతబాబు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ సమయంలో ఎమ్మెల్సీ మాట్లాడిన కాల్స్ వ్యవహారంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ నాలుగు రోజుల్లో అనంతబాబు ఎక్కువగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో మాట్లాడారట. చంటిబాబు జగ్గంపేట…