Sajjala Ramakrishna Reddy: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం ప్రారంభించాం.. ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు.. వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ కీలక నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన పోస్టర్‌ల ఆవిష్కరణ,…
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ విద్య రంగంపై సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం దరిద్రపు పని అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడుతూ.. “మూడేళ్లలో మేము 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. ప్రతి జిల్లాలో గవర్నమెంట్ కాలేజీలు ఏర్పరిచాం. కానీ చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలనే ప్రయత్నం…
Seediri Appalaraju : శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్య రంగ పరిస్థితులపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన స్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని గురుకులల్లో విద్యార్థుల్లో హెపటైటిస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, కలుషిత ఆహారం, శుద్ధి చేయని నీరు కారణంగా ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) డాక్టర్లు నిరసనార్థం ధర్నాలు చేస్తున్నారని, ప్రజలకు…
Botsa Satyanarayana: మెడికల్ కాలేజీల ఏర్పాటు పేద వాని వైద్యానికి సంబంధించినదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాజాగా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు.. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీపడమన్నారు.. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుందని తెలిపారు.. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బతుకుతారని ప్రశ్నించారు. కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారని గుర్తు చేశారు.…
మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం అని మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు అంజద్ భాష పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పేద ప్రజలంటే సీఎం చంద్రబాబుకు అంత అలుసా? అని ప్రశ్నించారు. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తాం అని చెప్పారు. వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని, ఆ డబ్బును ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించవచ్చు కదా? అని…