Off The Record: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను జీరో చేసేశామని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నియోజకవర్గంలో రోజూ ఘర్షణ జరుగుతున్న కారణంగానే… అలా చేయాల్సి వచ్చిందని కామెంట్ చేశారు కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ. నాలుగు నెలల నుంచి వర్మ ఇస్తున్న స్టేట్‌మెంట్స్ వల్లే ఆ పరిస్థితి వచ్చిందని, ఇదంతా ఆయన స్వయంకృతమేనని క్లారిటీ ఇచ్చారు మంత్రి. తనని జీరో చేసినట్లు వర్మకు తెలుసునని, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిఠాపురంలోవివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదుకదా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రోజు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటనలో.. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు..
Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణం ఆగదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడు.. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నా పథకాలను కొనసాగిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వ పని తీరును ప్రజలే మెచ్చుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీ రిమాండ్‌ను మళ్లీ పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది కోర్టు..
ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం, ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించారు.. ఎన్నికల్లో ప్రచారం చేసి ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఏపీ సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి ఇవాళ లండన్ వెళ్లనున్నారు.. ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి లండన్ బయల్దేరనున్నారు..
కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో ఈ నెల 20వ తేదీన ఇరువురు వ్యక్తుల మధ్య రూ.300 విషయమై ఘర్షణ జరిగింది.. అదికాస్తా దాడికి దారిసింతి.. చాట్ల సతీష్ (27) పై కర్రతో దాడి చేశాడు వెంకటేశ్వరావు అనే వ్యక్తి.. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలయ్యారు చాట్ల సతీష్.. దీంతో, అతడిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. కానీ, విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి సతీష్ మృతి చెందాడు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తిరుపతిలో నిరసనలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. వైఎస్ జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకొనే ప్రక్రియ.. జగన్ విషయంలో ఆయన మతాన్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదిది. వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడవద్దు.. ఆ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.. ఇక, అధినేత…
రైలు కిందపడి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు.. పట్టాలపైకి ఎక్కారు.. తీరా రైలు వచ్చే సమయానికి ఓ ప్రేమికుడు.. తన ప్రియురాలు బతకాలని అనుకున్నాడు.. దీంతో.. ప్రియురాలిని రైలు పట్టాల పై నుంచి కిందకి తోసేసి.. తాను మాత్రం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు..