Gottipati Ravi Kumar: ఎన్నికల సమయంలో పెన్షన్స్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి 50 మంది వృద్దులు మరణించారు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మాపై కావాలని నిందలు వేశారని ప్రజలకు అర్థమైంది.. పెన్షన్ ను సచివాలయ సిబ్బందితో మొదటి రోజు 98 శాతం పంచడం మా ప్రభుత్వం గొప్పదనం.. గతంలో అన్నా క్యాంటీన్ లను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.. ఆగస్ట్ 15 నుంచి అన్నా క్యాంటీన్ లను ప్రారంభిస్తాం.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం.. బ్రిటిష్ కాలం నాటి రికార్డులను ధ్వంసం చేశారు.. ప్రజల ఆస్తులను లాక్కోవాలని చూశారు అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశం.. గత 5 సంవత్సరాలు మమ్మల్ని ఏడిపించారు, కొట్టారు.. అసెంబ్లీలో చంద్రబాబు వాళ్ళు చేసిన దుర్మార్గం మనం చేయకూడదని చెప్పారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
Read Also: MS Dhoni: ధోనీని ‘తల ఫర్ ఎ రీజన్’ అని ఎందుకు పిలుస్తారు?.. దాని వెనుక కథను చెప్పిన మహి!
కాగా, రాష్టంలో ప్రశాంతవంతమైన వాతావరణం వుండాలి అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. వాళ్ళు చేసినట్టు మనం చేస్తే రేపు ఆ రిజల్ట్ మనకు కూడా వస్తుంది.. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు ఇది కనువిప్పు కావాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే వాళ్ళయినా మనమయినా అదే రిజల్ట్ వస్తుంది.. చంద్రబాబు సారథ్యంలో వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు.