Botsa Satyanarayana: మొంథా తుఫాన్ సమయంలో పంట నష్టంపై ప్రభుత్వం దగ్గర సమగ్రమైన లెక్క లే లేవు… ఉంటే బహిర్గతం చేయండి అని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. 24 జిల్లాలలో రైతులు తుఫాన్ వల్ల నష్టపోతే ముఖ్యమంత్రి, మంత్రులు మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. ఈ 18 నెలల కాలంలో వర్షాలు, కరువు కారణంగా నష్టపోయిన ఎన్ని మండలాలకు ఎంత పరిహారం చెల్లించారు లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.. పంట నష్టంపై పూర్తి…
శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ... శాసన మండలిలో మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.. దీంతో, మండలిలో కూటమి వర్సెస్ వైసీపీగా మారింది పరిస్థితి.. ఇవాళ మండలిలో మంత్రి నారా లోకేష్ వర్సెస్ విపక్షనేత బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి.
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ పై క్లారిటీ ఇచ్చారు.. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది వైసీపీ విధానమని స్పష్టం చేశారు బొత్స.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం.. గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారు.. ఇప్పుడు అదే విధంతో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తాం అని స్పష్టం చేశారు..
ఏడాది కాలంలో చంద్రబాబు ప్రజలకు వెన్ను పోటు పొడిచారు.. కూటమి ప్రభుత్వం వంచనకు పాల్పడింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారు.. మహానాడు వేదికగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. అప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు ఓపికతో ఉండాలి అని సూచించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా.. పాకిస్తాన్ అయిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. సంపద సృష్టిస్తామని అన్నారు కదా.. ఇప్పుడు ఏమి అయ్యింది? అని ప్రశ్నించారు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్‌పై వైసీపీకి చాలా అనుమానాలు ఉన్నాయని సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ముసుగులో కూటమి పార్టీలు గుద్దులాడుతున్నాయని ఆరోపించారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సుమోటోగా తీసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ విజ్ఞప్తి చేశారు. సారీ చెప్పడం ద్వారా జరిగిన నష్టం నుంచి తప్పించుకోలేరని.. ప్రయశ్చిత దీక్ష సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల్లో ఎవరు చేస్తారు అని ప్రశ్నించారు.
బొత్స సత్యనారాయణ.... లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ప్రస్తుతం ఇదే పొలిటికల్ హాట్. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఓ వెలుగు వెలిగిన నేత. రాజకీయ విమర్శలను సైతం తూకం వేసినట్టు చేసే బొత్సకు 2024 ఎన్నికలు చేదు అనుభవం మిగిల్చాయి. కంచుకోట లాంటి చీపురుపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కళా వెంకట్రావ్ చేతుల్లో ఓడిపోయారాయన.