Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Floodlight Collapse: విశాఖపట్నంలో వీచిన ఈదురుగాలులకు రైల్వే స్టేడియంలోని భారీ ఫ్లడ్ లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ స్టేడియంలో వందలాది మంది వాకింగ్, జాగింగ్ కోసం వస్తుంటారు. అయితే ఫ్లడ్ లైట్ కూలిన సమయంలో వర్షం, ఈదురుగాలుల కారణంగా మైదానం ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొద్దిసేపు వీచిన బలమైన గాలులకే ఫ్లడ్ లైట్ విరిగి పడటంతో నిర్మాణ నాణ్యత, నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఫ్లడ్ లైట్ కూలిపోవడానికి గల కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్రంలోని పలు జిల్లాలకు రానున్న మూడు గంటలపాటు పిడుగుపాటుతో కూడిన వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అరకు, చింతపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ సమయంలో భారీ గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది.. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించిన విషయం విదితమే..
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!