Nadendla Manohar: తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దీపం పథకం అమలు చేస్తున్నాం..
- కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది..
- ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి ఏడాదికి రూ. 2600కోట్లతో ఉచిత గ్యాస్ పథకం..
- చంద్రబాబు- పవన్ కళ్యాణ్ వల్లే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి: మత్రి నాదెండ్ల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: విజయవాడ గన్నవరం నుంచి ఇండిగో విమానంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళా నాయకులు మంత్రికి హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన్న నగరంలోని సన్ రే రిసార్ట్ కు వెళ్ళారు మంత్రి నాదెండ్ల. ఇక, విశాఖ నుంచి రోడ్డు మార్గాన రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా ఈడు పురం గ్రామం వెళ్లనున్నారు. నవంబర్ ఒకటో తారీఖున శ్రీకాకుళం జిల్లా ఈడు పురం గ్రామంలో జరగబోయే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఈడుపురం గ్రామంలో దీపం పథకం అమలు చేయనున్నారు.
Read Also: Delhi: పావురాల దాణా నిషేధానికి ఢిల్లీ సర్కార్ ఫ్లాన్! కారణమిదే!
Also Read
- Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా దీపం పథకం అమలు చేయనున్నాము.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం నిలబడి సంవత్సరానికి 2,600 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తుంది అన్నారు. ప్రతి మహిళకి ఆరోగ్య సమస్య రాకుండా సుమారు కోటి 50 లక్షలు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు.. గ్యాస్ బుక్ చేసుకున్న సుమారు 24 గంటల నుంచి 48 గంటలలోపు డబ్బులు వారి అకౌంట్ లో జమ అయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం.. అడ్వాన్స్ రూపంలో చెక్కులను గ్యాస్ కంపెనీలకు అందజేశాం.. గ్యాస్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసి పోయింది.. ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిందన్నారు. ధైర్యంగా చక్కటి నాయకత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కాబట్టి ఇతర దేశాలు నుంచి పెట్టుబడులు వస్తున్నాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
తాజావార్తలు
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
-
Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
-
Anil Kochhar: అమెరికా యూనివర్శిటీలో సంచలనం.. 176 మంది స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేసిన ఇండియన్! ఆయన ఎవరో తెలుసా..
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!