ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. దీపావళి సందర్భంగా దీపం-2 పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే కాగా.. ఈ స్కీమ్ కింద గ్యాస్ బుకింగ్స్‌కి భారీ స్పందన వస్తుందు.. అదే స్థాయిలో డెలివరీ చేస్తోంది కూటమి ప్రభుత్వం..
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా దీపం పథకం అమలు చేయనున్నాము.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం నిలబడి సంవత్సరానికి 2,600 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తుంది అన్నారు. ప్రతి మహిళకి ఆరోగ్య సమస్య రాకుండా సుమారు కోటి 50 లక్షలు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు.
మహిళల కోసం ఉచితంగా మూడు సిలిండర్ల పథకం తీసుకొచ్చాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అయితే, ఈ పథకంలో ఎవరూ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదన్నారు.. గ్యాస్ కనెక్షన్, రైస్ కార్డు (రేషన్ కార్డు)లకు ఆధార్ కార్డు నంబర్ అనుసంధానం చేసుకుని ఉంటే చాలు.. వారు అర్హులే అని స్పస్టం చేశారు..
Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ స్టార్ట్ అయింది. రోజు వారీ కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు. కొందరు గ్యాస్ కనెక్షన్ బుక్ తో పాటు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని గ్యాస్ కంపెనీల దగ్గర బుకింగ్ చేసుకునేందుకు క్యూ కట్టారు.
ఏపీలో మరో సంక్షేమ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుకను అందించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
Nadendla Manohar: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అని తేల్చి చెప్పారు.